కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. గత  మూడు వారాల నుండి భారీగా కేసులు నమోదవుతుండగా ఈరోజు కూడా అదే ట్రెండ్ కొనసాగింది. ఈఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 78 కేసులు నమోదు కాగా అందులో 67 విదేశాలు నుండి వచ్చినవి కాగా మిగితావి కాంటాక్ట్ కేసులు.. ఈరోజు కరోనాతో ఒకరు మృతిచెందగా 32మంది బాధితులు కోలుకున్నట్లు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈకొత్త కేసులతో కలిపి కేరళలో ఇప్పటివరకు మొత్తం 2322కేసులు నమోదుకాగా అందులో1303 కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇప్పటివరకు 999 బాధితులు కరోనా నుండి కోలుకోగా 19మంది మరణించారు. 
ఇక మిగితా దక్షిణాది రాష్ట్రాల రాష్ట్రాల విషయానికి వస్తే తమిళనాడులో ఈరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్కరోజే 1982కేసులు నమోదు కాగా 18 మంది మరణించారు. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 40698కి చేరింది కాగా ఇప్పటివరకు 367 కరోనా మరణాలు సంభవించాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఈరోజు 207కేసులు నమోదుకాగా తెలంగాణ లో 164 కేసులు బయటపడ్డాయి.ఓవరాల్ గా దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 300000దాటగా 8600మరణాలు చోటుచేసుకున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: