ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొద్ది వైరస్ ప్రభావం విస్తరిస్తున్న తరుణంలో ప్రభుత్వం సీరియస్ నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఇంటి నుండే విధులు నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. ముఖ్యంగా కంటెంట్మెంట్ అదేవిధంగా రెడ్ జోన్ పరిధిలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వ కార్యాలయాలకు రాకూడదని ఇంటి నుండే విధులు నిర్వహించాలని కోరింది. అంతేకాకుండా మధుమేహం మరియు ఊపిరితిత్తులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు వైద్యుల ద్రువీకరణ పత్రం అప్పజెప్పి వర్క్ ఫ్రం హోం చేయాలని ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

IHG

ప్రస్తుతం రాష్ట్రంలో వైరస్ ప్రభావం ఉన్న కొద్ది పెరుగుతున్న తరుణంలో జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల వ్యవస్థ కి కూడా కరోనా టెన్షన్ మొదలైంది. మొన్నటి వరకు మహారాష్ట్ర పోలీసు లకు పశ్చిమ బెంగాల్ పోలీసులకు మాత్రమే కరోనా వైరస్ సోకుతున్నట్లు వార్తలు రావటం మనం విన్నాం. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ లో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవటంతో పోలీసు శాఖలో కూడా టెన్షన్ మొదలైంది.

IHG

అంతేకాకుండా అసెంబ్లీ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగ సిబ్బందులకు కూడా వైరస్ సోకటం తో.. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది జగన్ సర్కార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్న తరుణంలో కేసులు భారీ స్థాయిలో బయటపడుతున్నాయి. దాదాపు ఐదు వేలకు పైగానే కేసులు ఏపీలో నమోదయ్యాయి. ఇటువంటి తరుణంలో జగన్ సర్కార్ ప్రభుత్వ కార్యాలయం వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త తీసుకొంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: