గత రెండున్నర నెలల్లో ప్రపంచంలో చైనా దేశాన్ని తిట్టుకోనివారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. మానవుల జీవన గమనాన్ని గాడి తప్పించి ప్రపంచ విధివిధానాలను తలకిందులు చేసిన కరోనా వైరస్ యొక్క పుట్టినిల్లు చైనా యొక్క వైఖరి ఇప్పుడు ఒక్క ప్రపంచ దేశానికి నప్పడం లేదు. వారేమో తాపీగా వైరస్ బారి నుండి బయటపడి తమ వ్యాపారాలు చేసుకుంటూ తమ పనులు చూసుకుంటూ ఉంటే మిగతా ప్రపంచమంతా దాని ధాటికి విలవిలలాడిపోతోంది.

 

ఇదంతా చూసి ఆగ్రహంతో రగిలిపోయాడో.... ఉక్రోషంతో ఊగిపోయాడో కానీ.... బీహార్ లో ఒక వ్యక్తి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పై కేసు వేసేశాడు. ఏకంగా హైకోర్టుకు వెళ్లి పిటిషన్ వేశాడు. ప్రపంచాన్ని వణికించేలా చేస్తున్న వైరస్ వ్యాప్తికి దేశమే కారణమని నేరుగా కోర్టు మెట్లు ఎక్కాడు.

 

వైరస్ వ్యాప్తికి చైనాను సూత్రధారిగా చేస్తూ దేశాధ్యక్షుడు జి జిన్పింగ్ ప్రపంచ దేశాలకు సరైన సమాచారం అందించడంలో విఫలమైనందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ పై బీహార్ కు చెందిన న్యాయవాది మురాద్ అలీ స్థానిక కోర్టులో ఫిర్యాదు చేశారు.

 

ఈనెల 16 తేదీన విచారణకు రానున్న కేసు ఇప్పుడు అందరి తలలను తన వైపుకు తిప్పుకుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.... పిటిషన్ లో చైనా వైరస్ వ్యాప్తి చెందింది అనడానికి ప్రధాన సాక్షులుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క పేర్లను సదరు వ్యక్తి పేర్కొన్నాడు. ఐపీసీ 269 270 302 307 500 504 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో కేసుపై ధర్మాసనం విధంగా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: