ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. నిన్న తెల్లవారుజామున ఏసీబీ అధికారులు అతని ఇంటి గోడ దూకి మరీ వెళ్లి అతనిని హుటాహుటిన అరెస్టు చేసి.... వెంటనే తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. వెంటనే అతనిని విజయవాడ కు తరలించడం మరియు విచారణ మొదలు పెట్టడం ఇంకా ఈఎస్ఐ స్కాం లో ఉన్న మిగిలిన అధికారులను మరియు వ్యాపారవేత్తలను అదుపులోకి తీసుకున్న విషయం కూడా తెలిసిందే.

 

అయితే ఎలాగైనా అచ్చెన్నాయుడుని వీలైనంత త్వరగా బయటకు తీసుకొని రావాలని టిడిపి వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ఇదే సమయంలో బాబు అచ్చెన్నాయుడు కి మూడు రోజుల క్రితం ఒక మేజర్ సర్జరీ జరిగిందని ప్రస్తావిస్తూ అతను ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉండగా అతనికి డిశ్చార్జి మెడికేషన్ ద్వారా ట్రీట్మెంట్ కూడా జరుగుతూనే ఉంది అని చెప్పారు. అయితే ఏసీబీ అధికారులు గోడ దూకి లోనికి వెళ్ళడం అతని సెక్యూరిటీని బయటకు పంపించడం.... ఇంకా కనీసం మందులు కూడా అతనితో వెంట తెచ్చుకునేందుకు అనుమతించకపోవడం (అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులు చెప్పినది) చూస్తుంటే ఇక్కడ అచ్చెన్నాయుడు కి బయిల్ కోసం ఒక సువర్ణ అవకాశం ఉందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

 

కోర్టు వారి ముందు అచ్చెన్న ను ప్రవేశపెట్టినప్పుడు అతను అనారోగ్యంతో ఉన్న మరియు ట్రీట్మెంట్ పొందుతున్న ఒక ప్రజా ప్రతినిధి అన్న విచక్షణ లేకుండా ఏసీబీ అధికారులు మూకుమ్మడిగా అతనిని అరెస్టు చేయడం మరియు ఇంట్లో వారికి కనీస సమాచారం ఇవ్వకుండా…. అతని వెంట మందులను కూడా తీసుకొనివచ్చేందుకు అనుమతి ఇవ్వకుండా అరెస్టు చేయాల్సిన అవసరం ఏమిటని ధర్మాసనం అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం వైఖరిపై కోర్టు చాలాసార్లు గత కొద్ది రోజుల్లోనే సీరియస్ అయిన విషయం తెలిసిందే.

 

అలాగే అచ్చం నాయుడు ఇక్కడ కొద్దిగా పరిణితిని ప్రదర్శిస్తే చాలు తర్వాత లీగల్ పాయింట్లు అన్నీ అతని న్యాయవాది చూసుకుంటాడు అని టిడిపి వర్గాలు బలంగా నమ్ముతునాయి. ఒకవేళ పొరపాటున అచ్చెన్నాయుడుకి అంతా అతనికి అనుకూలంగా జరిగి బెయిల్ పైన బయటకు వస్తే వైసీపీకి అది పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: