దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. గడచిన 24 గంటల్లో నమోదైన కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య మూడు లక్షలు దాటనుండగా కరోనా మృతుల సంఖ్య 8,600కు పైగా వైరస్ భారీన పడి మృతి చెందినట్టు తెలుస్తోంది. దేశంలో నమోదైన కేసుల్లో ఒక్క మహారాష్ట్రలోనే దాదాపు లక్ష కేసులు నమోదు కావడం గమనార్హం. 
 
అన్ లాక్ 1.0లో దేశంలో కరోనా కేసుల సంఖ్య , మృతుల సంఖ్య వేగంతా పెరుగుతోంది. జనం మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వల్లే ఈ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జులై నెలలోపు దేశంలోని పలు నగరాల్లో లక్ష కేసులు నమోదవుతాయని... అలా జరిగితే మరోసారి కేంద్రం లాక్ డౌన్ విధించినా ఆశ్చర్యపోనవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. 
 
తాజా నివేదికల్లో కరోనా విజృంభించే టాప్ 15 హై రిస్క్ దేశాల్లో భారత్ ఉందని తేలింది. లాక్ డౌన్ నిబంధనల సడలింపుల వల్ల దేశంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రముఖ స్టాక్ రీసెర్చ్ సంస్థ నోముర భారత్ లో ఇదే స్థాయిలో కేసులు నమోదైతే భారత్ లో మరోసారి 100 శాతం లాక్ డౌన్ అమలు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ సంస్థ 45 దేశాల్లో లాక్ డౌన్ సడలింపులపై అధ్యయనం చేసి 13 దేశాల్లో లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత కేసులు పెరుగుతున్నాయని తేల్చింది. 
 
లాక్ డౌన్ ను సడలించినప్పటికీ ఫ్రాన్స్, ఇటలీ, దక్షిణ కొరియా దేశాలకు పెద్దగా ప్రమాదం లేదని నోముర నివేదిక తేల్చి చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనా మహమ్మారిని తేలికగా తీసుకుంటే వైరస్ విజృంభించడం ఖాయమని తేల్చి చెప్పింది. మరోవైపు భారత్ లో 100 శాతం లాక్ డౌన్ ను అమలు చేస్తే ఆర్థిక రంగ సంక్షోభం తప్పదని నిపుణులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: