నేటికాలంలో కొందరు చేసే వింత చేష్టలు వారి ప్రాణాలను ప్రమాదంలో పడవేస్తున్నాయన్న విషయాన్ని విస్మరించి ప్రవర్తిస్తున్నారు.. వెర్రి వేయితలలు వేస్తుంటే వినేవాడు ఎవరు అన్నట్లుగా లోకం మారింది.. ఇకపోతే హోసూరులో టిట్‌టాక్‌ వీడియో కోసం బ్రతికి ఉన్న చేప మింగిన యువకుడు ఊపిరాడక మృతి చెందాడు.. ఈ ఘటన వివరాలు తెలుసుకుంటే..

 

 

కృష్ణగిరి జిల్లా హోసూరు ఖాలేగుంట పార్వతీ నగర్‌కు చెందిన వెట్రివేల్‌ (22) అనే యువకుడు మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు.. అతనికి వివాహమై భార్య, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. ఇక తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేద్దామని భావించిన ఇతను గురువారం హోసూరు తెర్‌పేటలో ఉన్న చెరువు గట్టుకు చేపలు పట్టడానికి వెళ్లారు.. అప్పటికే వీరందరు ఫుల్‌గా మద్యం తాగి ఉన్నారు.. ఆ మద్యం మత్తులోనే చేపలు పడుతున్నారు. అదే సమయంలో టిక్‌టాక్‌ చేయాలనే ఆలోచన మెదడులో రావడంతో ఓ వీడియో చేయడానికి చేపను మింగాడు. ఆ చేప కాస్త అతని శ్వాసనాళంలో చిక్కుకోవడంతో ఊపిరాడక అక్కడే అతను స్పృహతప్పి పడిపోయాడు.

 

 

ఇది చూసిన స్నేహితులు అతన్ని వెంటనే హోసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఇతన్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే  వెట్రివేల్ మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న హోసూరు టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.. ఇకపోతే ఈ మాయదారి టిక్‌టాక్ వల్ల ఎన్ని ప్రాణాలు పోతున్న ఎవరు పట్టించుకోవడం లేదు.. ఏదో అప్పుడప్పుడు సునామి వచ్చినట్లుగా ఈ యాప్ నిషేధించాలని అంటున్నారే గాని పూర్తిగా ఇది నిషేధించే దిశగా ఎవరు ఆలోచించడం లేదు.. ఇప్పటికే యువతతో పాటుగా ప్రతివారు ఈ టిక్‌టాక్ బానిసలుగా మారిపోయారు.. తిండి లేకుండా ఉంటారేమో గానీ టిక్‌టాక్ లేకుండా బ్రతకలేని వారు ఉన్నారు..వీరి పిచ్చికి ఇంకెన్ని ప్రాణాలు పోతాయో.. 

మరింత సమాచారం తెలుసుకోండి: