కరెంట్ ముట్టుకుంటేనే షాక్ వస్తుంది.. కానీ తెలంగాణలో కరెంట్ బిల్లులు వినియోగదారులకు అంతకంటే ఎక్కువగా షాక్ ఇస్తున్నాయి.. దీనికంతటికి కారణం లాక్‌డౌన్.. అవును లాక్‌డౌన్ వల్ల కొందరికైతే లక్షల్లో బిల్లులు వస్తుండటంతో గగ్గోలు పెడుతున్నారు.. ఇక కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడికి చెందిన ఓ ఇంటికి రూ.7 లక్షలకు పైగా కరెంట్ బిల్లు వచ్చింది. ఫిబ్రవరి 18 నుంచి జూన్ 9 మధ్య 76,871 యూనిట్ల విద్యుత్ వాడారని రూ. 7,29,471 లక్షలు కట్టాలని బిల్లు చేతిలో పెట్టారు. గత డిసెంబర్ నంచి ఫిబ్రవరి 18 వరకు రూ. 414 మాత్రమే బిల్లు రాగా ఈసారి ఏడు లక్షల రూపాయలు దాటడం తప్పిదమేనని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.

 

 

అంతే కాకుండా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఓ చిన్న మొబైల్ షాప్‌కి రూ.12,04,738 కరెంట్ బిల్లు వచ్చింది. ఇలా ఒకచోట నేది ఏం లేదు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిచోట ఇదే తంతు.. అయితే ఇందులో కొందరికి సాంకేతిక తప్పిదాలతో లక్షల రూపాయల్లో బిల్లులు వస్తుంటే.. మరికొందరికి మాత్రం ఎక్కువగా వాడారంటూ గతంలో ఎన్నడూ లేనంతగా బిల్లులు వస్తున్నాయి.

 

 

దీంతో జనంతో పాటుగా ప్రతిపక్షాలు కూడా ఆందోళన చేయడం, జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో. టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి స్పందించి, కరెంట్ బిల్లులపై సందేహాలను నివృత్తి చేయడం కోసం ఈఆరోవోల వద్ద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ-మెయిల్ ట్విట్టర్ ద్వారా అందిన ఫిర్యాదులను రెండు రోజుల్లో పరిష్కరించాలని, విద్యుత్ వినియోగదారులకు బిల్లింగ్ వర్క్ షీట్ ద్వారా సమాధానం పంపాలని అధికారులను ఆదేశించామని రఘుమారెడ్డి తెలిపారు. ఇకపోతే ఆన్‌లైన్‌లో సందేహాల నివృత్తి కోసం customerservice@tssouthernpower.com కు మెయిల్ చేయొచ్చు, లేదంటే twitter/TsspdclCorporat, twitter/TSNPDCLORGANIZA కు సంప్రదించవచ్చని తెలిపారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: