ఆంధ్రాలో కరోనా కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి. మరో వైపు రాష్ట్ర రాజకీయాలపై అధికార ప్రతిపక్షాలు కత్తులు దూసుకుంటున్నాయి. సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీ నేతలపై కత్తి దూస్తుందని ఒకరు అంటే.. జగన్ సర్కారు తదుపరి టార్గెట్ చంద్రబాబు, లోకేశ్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల కేబినెట్ మీటింగ్‌లో ఫైబర్ గ్రిడ్, చంద్రన్న కానుక వంటి పథకాల్లో చోటు చేసుకున్న అవినీతిపై సీబీఐ విచారణకు కూడా సర్కారు సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.

 

 

ఇంతలో అనూహ్యంగా ఏపీ ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిని ఈఎస్‌ఐ మందుల కేసులో అరెస్టు చేసేశారు. అచ్చెన్న హయాంలో 150 కోట్ల వరకూ అక్రమాలు జరిగాయని అందులో అచ్చెన్నాయుడి పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించాయని ఏసీబీ అంటోంది. అయితే ఇదే కేసులో మరో మాజీ మంత్రి అరెస్టుకు కూడా రంగం సిద్ధమైందంటున్నారు. ఎందుకంటే ఈ ఈఎస్‌ఐ మందుల కుంభ కోణంలో అచ్చం అచ్చెన్నాయుడు ఎలాంటి మిస్టేక్ చేశాడో ఆయన కూడా అదే మిస్టేక్ చేశాడు.

 

 

ఆయన ఎవరునుకుంటున్నారా.. ఆయనే మాజీ మంత్రి పితాని సత్యనారాయణ. అచ్చెన్నాయుడు నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఖరారు చేయించడం, టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్లు ఇప్పించడం, ఉనికిలో లేని కంపెనీల నుంచి నకిలీ కొటేషన్లు, రేట్ కాంట్రాక్టు లేని కంపెనీలకు రూ.51 కోట్లు చెల్లించడం వంటి తప్పులు చేశారని ఏసీబీ చెబుతోంది. ఇందుకు ఆధారంగా అచ్చెన్నాయుడు రాసిన సిఫార్సు లెటర్ ను ఆధారంగా చూపుతున్నారు.

 

 

అయితే మాజీ మంత్రి పితాని కూడా అలాగే చేశాడు. అచ్చెన్నాయుడు ఇచ్చినట్లుగానే మాజీ మంత్రి, కార్మికశాఖను నిర్వహించిన పితాని సత్యనారాయణ కూడా ఓ సిఫార్సు లెటర్ ఇచ్చారు. మరి అచ్చెన్నాయుడిని అరెస్టు చేసినప్పుడు పితానిని కూడా అరెస్టు చేయకతప్పదేమో.. అందుకే తదుపరి వికెట్ పితాని అనే టాక్ బాగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: