ఓవైపు కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తున్నా.. జనం మాత్రం దాన్ని పెద్దగా పట్టించుకుంటున్నట్టు లేదు. లాక్ డౌన్ సమయంలో చాలా జాగ్రత్తగా ఇళ్లకే పరిమితమైన జనం.. దాన్ని కాస్త ఎత్తేయగానే.. కరోనా జాగ్రత్తలు కూడా గాలి కొదిలేస్తున్నారట. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్తే భౌతిక దూరం పాటించడం, మాస్కు తప్పనిసరిగా వాడటం వంటి కనీస జాగ్రత్తలు కూడా చాలా మంది తీసుకోవడం లేదు.

 

 

ఇక జనం చేసే రొటీన్ తప్పులేంటో తెలుసా.. అవసరం ఉన్నా లేకున్నా జనం గుంపుల్లోకి వెళ్తున్నారు. మొన్నటికి మొన్న ముషీరాబాద్‌ చేపల మార్కెట్‌లో ఆదివారం వేలమంది గుమిగూడటం ఆశ్చర్యపరిచింది. అనేక మార్కెట్లలో ఇదే పరిస్థితి. విచ్చలవిడిగా వేలల్లో సంచరిస్తున్నారు. అందుకే మీరు జనసమ్మర్ధం అధికంగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండండి.

 

 

మరో తప్పు ఏంటంటే.. పని ఉన్నా లేకపోయినా బయట తిరగడం. ఇది ఏమాత్రం క్షమించలేని తప్పు. ఎంతో అత్యవసరమైన పని ఉంటే తప్ప బయటకు వెళ్లకూడదు. అలా వెళ్తే మీరు బాగానే ఉంటారు. కానీ మీ ద్వారా ఇంట్లో ఉన్న పెద్దలు, పిల్లలకు కరోనా వస్తుంది. ఒకవేళ వెళ్లినా.. వెళ్లే ముందు.. వెళ్లి వచ్చాక చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.

 

 

మరికొందరు వ్యక్తిగత వాహనాల్లో కాకుండా ఆటోల్లో బయటకు వెళ్తున్నారు. సాధారణంగా నిబంధనల ప్రకారం డ్రైవర్‌తో కలిసి ముగ్గురు కంటే ఎక్కువ మంది ఆటోలో ప్రయాణించకూడదు. కానీ కొందరు డ్రైవర్లు ఎక్కువ మందిని కుక్కేస్తున్నారు. ప్రత్యేకించి తిరుగుతున్న సెవెన్‌ సీటర్‌ ఆటోలు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. అందుకే ఇలా కుక్కే పరిస్థితి ఉంటే.. మీరు ఆ ఆటో ఎట్టిపరిస్థితుల్లో ఎక్కొద్దు. మరికొందరు రోడ్లపై ఉమ్మేస్తున్నారు. నోటి తుంపర్ల ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుందని తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: