ప్రయాణాల్లో ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి కాదని, అది లేకుండా కూడా రైళ్లు, విమానాల్లో ప్రయాణించవచ్చని కేంద్ర ప్రభుత్వం కర్ణాటక హైకోర్టుకు తెలిపింది.  బెంగళూరుకు చెందిన సైబర్ కార్యకర్త అనివర్ అరవింద్ ఈ యాప్‌కు సంబంధించి పలు సందేహాలను వ్యక్తం చేస్తూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేంద్రం ఈ విషయాన్ని తెలిపింది. యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలనేది ప్రభుత్వ సూచన మాత్రమేనని, ప్రయాణికులు ఎవరికి వారే దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని అదనపు సొలిసిటర్ జనరల్ ఎంఎన్ నర్గుంద్ కోర్టుకు తెలిపారు. ప్రయాణికులు తప్పకుండా ఆరోగ్యసేతు యాప్‌ను కలిగి ఉండాల్సిన అవసరం లేదని, దానికి బదులుగా స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని కూడా సమర్పించవచ్చని కోర్టుకు తెలిపారు.  శుక్రవారం నాటి విచారణ సందర్భంగా కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎంఎన్ నర్గుంద్ వాదనలు వినిపించారు.

IHG

యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలనేది ప్రభుత్వ సూచన మాత్రమేనని, ప్రయాణికులు ఎవరికి వారే దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని అదనపు సొలిసిటర్ తెలిపారు.  కేంద్రం వాదనలపై స్పందించిన హైకోర్టు.. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేవారు ఆరోగ్యసేతు యాప్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలనే నిబంధనకు సంబంధించి చట్టబద్ధత ఉంటే తెలియజేయాలని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను జులై 10కి వాయిదా వేసింది.  కాగా గత పదిహేను రోజుల నుంచి దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మరింత వేగంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య సేతు యాప్ విషయంలో ఈ చర్చ వెలుగు లోకి వచ్చింది.

IHG

కాగా, కరోనా వైరస్ కట్టడికి కేంద్రం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్‌పై పలు విమర్శలు, వివాదాలు నెలకున్న విషయం తెలిసిందే. దీని వల్ల వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.  ఇక కోవిడ్‌-19 మహమ్మారిపై పోరాటంలో సాంకేతిక పరిజానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో భారతదేశం ముందుందని’ నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్‌ కాంత్ వారం రోజుల కిందట తన సోషల్ మాద్యమంలో పోస్ట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: