దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,458 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇంత భారీగా కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 3,08,993కు చేరింది. దేశంలో 1,54,329 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా 1,45,779 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 
 
గత 24 గంటల్లో 386 మంది కరోనా భారీన పడి మృతి చెందగా 8,884 కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ దేశంలో కరోనా రికవరీ రేటు 49.94 శాతంగా ఉన్నట్లు ప్రకటన చేసింది. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. గత నెల 11వ తేదీన మోదీ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సలహాలు, సూచనలు స్వీకరించారు. 
 
దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతూ ఉండటంతో జూన్ 16, 17 తేదీలలో రెండు రోజుల పాటు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారని సమాచారం అందుతోంది. అన్‌లాక్ 1.0పై రాష్ట్రాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడంతో పాటు సీఎంలతో చర్చించి మోదీ వారి అభిప్రాయాలను స్వీకరించనున్నారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల సీఎంలతో మోదీ ప్రత్యేకంగా భేటీ కానున్నారని తెలుస్తోంది. 
 
కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రధానంగా మోదీ చర్చించనున్నారని సమాచారం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలతో జూన్ 17న మోదీ మాట్లాడతారని తెలుస్తోంది. మరోవైపు కరోనా వైరస్ విజృంభణ వల్ల పూర్తిస్థాయి లాక్ డౌన్ ను అమలు చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రధాని మోదీ ఐదు వారాల పాటు కఠినమైన లాక్ డౌన్ ను అమలు చేయనున్నారని... అందుకే సీఎంలతో భేటీ కాబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: