గత కొన్ని రోజుల నుంచి చైనా భారత సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. చైనా భారత సరిహద్దుల్లో ఇరు దేశాలకు చెందిన సైనికులు ఆయుధాలతో దాడి చేసుకోకపోయినప్పటికీ ఒకరిపై ఒకరు పిడి గుద్దులు కురిపించుచుకుంటూ దాడి మాత్రం చూసుకుంటున్నారు. అంతే కాకుండా అటు చైనా భారత్ సరిహద్దులో భారీ మొత్తంలో సైనికులను మోహరించడం మరింత ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుంది, ఏ క్షణాన యుద్ధం జరుగుతుందో అనే పరిస్థితి ప్రస్తుతం చైనా భారత్ సరిహద్దులో నెలకొంది. అయితే చైనా ఎలాంటి ముందడుగు వేసిన భారత్ దానికి ధీటుగా సమాధానం ఇస్తుందిmఅయితే ఎట్టకేలకు చైనా భారత్తో చర్చలు జరిపేందుకు సిద్దం అయిన విషయం తెలిసిందే. 

 

 అయితే తాజాగా చైనా భారత్ సరిహద్దులో నెలకొన్న పరిస్థితుల గురించి ఆర్మీ చీఫ్ జనరల్ ఎం ఎం నారవానే  క్లారిటీ ఇస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం చైనా భారత్ సరిహద్దులో మొత్తం పరిస్థితి అదుపులోనే ఉంది అంటూ అందరికీ భరోసానివ్వాలి అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావానే. ప్రస్తుతం చైనా తో ఎంతగానో సీరియస్ గా చర్చలు జరుపుతున్నామని  చెప్పుకొచ్చారు. స్థానిక స్థాయి సమావేశాలు తో పాటు
.. కార్ఫ్స్  కమాండర్ స్థాయి వాళ్ళతో కూడా చర్చలు జరుపుతున్నట్లు చెప్పుకొచ్చారు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం కారావానే. 

 


 ఇక ప్రస్తుతం చైనాతో జరుపుతున్న చర్చల తో భారతదేశం చైనా మధ్య ఇప్పటి వరకు ఉన్న అన్ని తేడాలను తొలగించి విభేదాలకు విశ్రాంతినిచ్చేలా చర్చలు జరపడం ద్వారా  అంతా సద్దుమణుగుతుంది అని తాము భావిస్తున్నట్లు గా చెప్పుకొచ్చారు. అయితే సరిహద్దుల్లో ప్రస్తుతం పరిస్థితి మాత్రం అంత అదుపులోనే ఉందని చెప్పుకొచ్చారు ఆర్మీ చీఫ్ జనరల్. ఇకపోతే చైనా భారత్ సరిహద్దులో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే అని అటు ప్రపంచ దేశాలు కూడా ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్న విషయం తెలిసిందే. ఏకంగా అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వివాదంపై స్పందిస్తూ చైనాకు ఇండైరెక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: