ఈ మధ్యకాలంలో ప్రేమ ఒక చేదు అనుభవంగా మారిపోతుంది. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి వంచిస్తున్న  వారు ఎక్కువవుతున్నారు. సాధారణ యువకులే కాదు సెలబ్రిటీలు సైతం ఇలాంటి వేధింపులకు గురవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి  తెరమీదకి వచ్చింది. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి తన సహనటి ని నమ్మించి వంచించి ఆ తర్వాత మొహం చాటేసిన తమిళ నటుడుని  తాజాగా చెన్నై పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోశారు. వివరాల్లోకి వెళితే... చెన్నై రాజా అన్నామలై పురానికి చెందిన త్యాగరాజన్  అనే నటుడు... తరిసులం  అనే తమిళ సినిమాలో హీరోగా నటించాడు. 

 

 ఈ క్రమంలోనే నాడోడిగళ్  అనే సినిమాలో సహాయ నటి పాత్ర పోషించిన మహిళపై కన్నేసిన  ఆ వ్యక్తి ఆ మహిళతో పరిచయం ఏర్పర్చుకున్నాడు. ఇక సదరు మహిళ తో పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసేలా మాయమాటలతో కవ్వించాడు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అంటే సదరు మహిళ త్యాగరాజన్  కంటే వయసులో పెద్దది. అయినప్పటికీ కూడా ప్రేమ పేరుతో సదరు మహిళ తో నాటకమాడాడు . ఈ క్రమంలోనే సదరు మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కొన్ని రోజుల పాటు ఏకంగా సహజీవనం కూడా చేశారు. 

 

 ఈ క్రమంలోనే మహిళకు మాయమాటలు చెప్పి ఎన్నోసార్లు లైంగిక వాంఛ తీర్చుకోవడం తో పాటు మహిళల నుంచి భారీ మొత్తంలోనే డబ్బులు కూడా వసూలు చేశాడు . ఇక ఇటీవల త్యాగరాజన్  చెన్నై కార్పొరేషన్ లో ఉద్యోగం వచ్చింది. ఇక ఆ తర్వాత సదరు మహిళ నుంచి దూరంగా ఉంటూ వచ్చాడు. తన సహాయ నటి అయిన మహిళ తో మాట్లాడడం మానేసాడు. దీంతో అనుమానం వచ్చిన ఆ మహిళ త్యాగరాజన్ ను  నిలదీయగా తన మనసులోని మాటను బయట పెట్టి ఆ మహిళ కు షాకిచ్చాడు. నువ్వు నాకంటే వయసులో పెద్ద దానివి అందువల్లే మన పెళ్ళికి మా పేరెంట్స్ ఒప్పుకోలేదని... అందుకే నువ్వు వేరొకరిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు.

 

 

అంతేకాకుండా ఇంకోసారి తనతో మాట్లాడాలని ప్రయత్నిస్తే చంపేస్తానంటూ బెదిరింపులకు కూడా దిగాడు. దీంతో చేసేదేమీ లేక సదరు మహిళ పోలీస్ స్టేషన్కు వెళ్లి గోడు వెళ్లబుచ్చుకుంది. త్యాగరాజన్  పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం అతనికి కోర్టు రిమాండ్ విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: