ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆయనను అరెస్ట్ చేయడంపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. చంద్రబాబు నుంచి కింది స్థాయి నేతల వరకు అందరూ కూడా ఇప్పుడు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా  టీడీపీ నేతలు అందరూ కూడా ఇది బీసీల మీద కక్ష సాధింపు అంటూ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అనవసరంగా ఇప్పుడు టీడీపీ దీని మీద బీసీ కార్డ్ తీసుకొచ్చింది అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినపడుతున్నాయి. 

 

అవినీతిచేసిన వ్యక్తి బీసీ అయితే ఏంటీ మరో కుల౦ అయితే ఏంటీ...? అవినీతి ఏమీ లేకుండా అతన్ని ఏమైనా  అనవసరంగా ఇరికించి ఉంటే ఆ విమర్శ చేసినా సరే ఒకరకంగా ఉండేది. కాని ఇప్పుడు అనవసరంగా బీసీ కార్డు తీసుకుని టీడీపీ అల్లరి అయింది అన్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. చంద్రబాబు, సహా లోకేష్ మొదలు కుని అందరు టీడీపీ నేతలు  పదే పదే బీసీలు అని విమర్శిస్తున్నారు. అవినీతి ఆరోపణలు వారి మీద రాకూడదా అనే ప్రశ్న టీడీపీ నేతల నుంచే ఎక్కువగా ఎక్కువగా వినపడుతుంది. 

 

అంత ఎందుకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్. కృష్ణ‌య్య సైతం చంద్ర‌బాబుకు ఇప్పుడు బీసీలు గుర్తుకు వ‌చ్చారా ?  ఆయ‌న బీసీల పేరు చెప్పుకుని బీసీల‌ను మోసం చేశారంటూ తీవ్రంగా విమ‌ర్శించారు. ఇక బ‌య‌ట  కూడా అనవసరంగా ఈ విషయంలో బీసీ కార్డ్ ని టీడీపీ వాడింది అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికి అయినా సరే బీసీ అనే  పదం మానుకుని నిర్మాణాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తే మంచిద‌న్న అభిప్రాయాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: