తెలంగాణ‌లో క‌రోనాకు ముందు వ‌ర‌కు రాజ‌కీయం పూర్తిగా అధికార టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ‌న్ సైడ్‌గా ఉంది. అప్ప‌టి వ‌ర‌కు టీఆర్ఎస్‌, సీఎం కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేసేందుకు కూడా ఎవ్వ‌రూ సాహ‌సించ‌ని ప‌రిస్థితి. అయితే తెలంగాణా రాజకీయాల్లో ఇప్పుడు కొందరు కాంగ్రెస్ నేతల దూకుడుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణాలో ఏ మాత్రం బలంగా లేని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దూకుడుగా విమర్శలు చేస్తుంది అధికార పార్టీ మీద.... సిఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. అదే విధంగా మంత్రి కేటిఆర్ ని లక్ష్యంగా చేసుకుని కూడా కాస్త ఎక్కువగానే విమర్శలు చేస్తున్నారు. టీ కాంగ్రెస్ నేత‌లు నిన్న మొన్న‌టి వ‌ర‌కు కేసీఆర్‌ను విమ‌ర్శించేందుకే సాహ‌సించ‌ని ప‌రిస్థితి.

 

అయితే ఇప్పుడు ఒక్క‌సారిగా వీరి స్వ‌రంలో మార్పు రావ‌డం ఏంటో ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. అయితే దీని వెనుక బిజెపి హస్తం ఉంది అని సమాచారం. బిజెపి రాష్ట్ర పార్టీ నేతల నుంచి కాంగ్రెస్ నేతలకు పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తోంది అని అందుకే వారు ఇప్పుడు ఎక్కువగా నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు అని అంటున్నారు. సాగునీటి ప్రాజెక్ట్ ల విషయంలో కూడా ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తోంది.

 

దీని వెనుక కచ్చితంగా రాష్ట్ర పార్టీ బిజెపి నుంచి సహకారం ఉంది అని,  తెరాస ని టార్గెట్ చేయడానికి క్షేత్ర స్థాయిలో బలం ఉన్న ఒక కాంగ్రెస్ ని వాడుకునే ప్రయత్నాలను బిజెపి చేస్తుంది అని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని ఇప్పుడు మాత్రం ఈ ప్రచారం కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా కాస్త ఆగ్రహానికి వేదికగా మారింది అని అంటున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో ఇంకేం జరుగుతాయో... ?

మరింత సమాచారం తెలుసుకోండి: