చేపలకు జీవనాధారం నీరు.. నీటిలో ఉన్నంత వరకు దాని ప్రపంచం వేరే ఉంటుంది.. ఒక్కసారి నీటి నుంచి బయట పడితో ఊపిరి ఆడక చనిపోతుంది.  ఆ నీటి బలంతోనే చేపకు ఎవరూ ఈత నేర్పనవసరం లేదని అంటారు.  అలాంటిది నీరు లేక వేల కొలది చేపలు విల విలలాడుతున్నాయి. ఈ దృష్యం చూస్తే మనసున్న ప్రతి మనిషికి బాధ కలిగిస్తుంది.  రాజస్థాన్‌ జోద్‌పూర్‌లోని సోయ్లా గ్రామంలో చోటు చేసుకుంది. వర్షాలు లేకపోవడంతో.. చెరువులో నీటిమట్టం తగ్గిపోయింది. చెరువు పూర్తిగా ఎండిపోయే స్థితికి రావడంతో చేపల జీవనానికి ఇబ్బంది ఏర్పడింది.

 

కొన్ని చేపలు చనిపోయాయి. అయితే ఆ చేపల దుర్భరమైన పరిస్థితి చూసి అక్కడి గ్రామస్తులు చలించిపోయారు.. దాంతో తలా రూ. 300 జమ చేసి దగ్గరలోని ట్యాంకర్లను తెప్పించారు.  ఆ ట్యాంకర్ల ద్వారా చెరువులోకి నీరు వదిలారు.  అయితే ఈ నీరు తాత్కాలికంగా వాటి ప్రాణాలు ఉపశమనం కలిగిస్తుంది.. కానీ ఆ చెరువు నిండితేనే ఆ చేపలకు సరైనా ఆధారం లభిస్తుందని అంటున్నారు గ్రామస్థులు. 

 

నిజంగా ప్రకృతి ఎంత విచిత్రమైనదో ఓ వైపు ఎడతెరిపి లేకుండా వర్షాలతో ముంచేస్తుంటే.. మరోవైపు నీటి చుక్క లేకుండా నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.  ఈ చెరులో నీరు అయితే ఇప్పటి వరకు నింపగలిగినా.. ప్రస్తుతం కరోనాతో కష్టకాలంలో ఉన్న గ్రామ ప్రజలు  చేపల జీవనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.  ఏది ఏమైనా ఇప్పుడు దేశం మొత్తం కరోనా ప్రభావంతో ఆర్థికంగా కష్ట కాలంలో ఉంది.. ఈ సమయంలో గ్రామస్థుల మంచి మనసుకు కితాబు ఇవ్వాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: