దేశంలో మొన్నటి వరకు కరోనా మహమ్మారి వల్ల వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు నరకం అనుభవించారు. దాదాపు నలభై రోజుల వరకు చేయడానికి పనులు లేక.. కడుపు నిండా తిండి లేక తమ స్వస్థలానికి చేరుకోవడానికి వాహనాలు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కొంత మంది ధైర్యం చేసి వివిధ రాష్ట్రాల నుంచి కాలినడకన బయలు దేరారు.. ఆ బాటలో కొంత మందిని మృత్యువు కబలించింది.  దాంతో వలస కూలీలు పడుతున్న ఇబ్బందులు దూరం చేసేందుకు కేంద్ర వారికి శ్రామిక్ రైళ్లు, బస్సులు ఏర్పాటు చేసి స్వస్థలాలకు పంపారు.  మరికొంత మంది దాతలు ముందుకు వచ్చి వసల కూలీలను ప్రైవేట్ బస్సుల్లో పంపారు. ముఖ్యంగా బాలీవుడ్ నటులు అమితాబచ్చన్, సోనూ సూద్ స్వయంగా వారికి ఆహార సదుపాయాలు కల్పిస్తూ బస్సుల్లో, రైళ్లలో, ఫ్లైట్స్ సోంతూళ్లకు పంపారు.  

IHG

ఇలా తమ స్వస్థలాలకు చేరుకున్న కూలీలో ఏదో ఒక పని చేస్తూ తమ కడుపు నింపుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో బ‌తుకుదెరువు కోసం ముంబైకి వ‌ల‌స‌పోయి క‌రోనా మ‌హమ్మారి కార‌ణంగా స్వ‌స్థ‌లాలకు తిరిగొచ్చిన వ‌ల‌స‌కూలీలకు క‌ర్ణాట‌క‌లోని క‌ల‌బురిగి జిల్లా అధికారులు స్థానికంగా ఉపాధి క‌ల్పించారు. మ‌హాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం కింద కూలీలంద‌రికీ ప‌ని క‌ల్పించిన‌ట్లు అధికారులు తెలిపారు.  స్థానిక‌ అధికారులు ఉపాధి క‌ల్పించ‌క‌పోతే తాము మ‌ళ్లీ ముంబైకి వెళ్లాపోవాల్సి వ‌చ్చేద‌ని వారు చెబుతున్నారు.

IHG

తాము ముంబై నుంచి తిరిగొచ్చిన త‌ర్వాత 15 రోజులు హోంక్వారెంటైన్‌లో ఉంచార‌ని, క్వారెంటైన్ పూర్తికాగానే ఇప్పుడు ఉపాధి క‌ల్పించార‌ని చెప్పారు.  అధికారులు చేస్తున్న మంచి పనికి లాడ్చించోలి గ్రామానికి చెందిన కూలీలు సంతోషం వ్య‌క్తం చేశారు. యితే ఎప్ప‌టికీ ప‌ని ఇలాగే దొరికితే ప‌ర్వాలేద‌ని, లేదంటే మాత్రం తాము బ‌తుకుదెరువు కోసం మ‌ళ్లీ ముంబైకి వెళ్ల‌క త‌ప్ప‌ద‌ని కూలీలు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: