సాధారణంగా మనం హర్రర్ సినిమాలు చూస్తుంటాం.. అందులో దెయ్యం కనిపించదు.. కానీ వస్తువులు మాత్రం వాటంతట అవే కదులుతుంటాయి.. మనుషులపై దాడులు చేసి చంపుతుంటాయి.  ఇలాంటి సినిమాలు థియేటర్లో చూడటానికి బాగానే ఉంటాయి.. కానీ నిజ జీవితంలో చూస్తే గుండె గుభేల్ మంటుంది. మనిషి దేవుడిని ఎంత భక్తితో కొలుస్తారో.. దెయ్యం అంటే అంత భయపడిపోతారు.  పట్టణ ప్రాంతాల్లో వీటి గురించి పెద్దగా పట్టించుకోకున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో దెయ్యాల భయం ఇంకా వెంటాడుతూనే ఉంటుంది.  రాత్రి పూట ఒంటరిగా బయటకు వెళ్లే సాహసాలు చేయరు. మూఢ నమ్మకాలను క్యాష్ చేసుకోవడాని ఎంతో మంది బురిడీ బాబలు వస్తుంటారు.. చేతబడి, భాణామతి, క్షుద్ర పూజలు ఇలా ఎన్నో చెప్పి గ్రామస్థులను భయపెడుతుంటారు.  తాజాగా ఓ దెయ్యం ఓపెన్ జిమ్‌లో వ్యాయామం చేస్తోందంటూ వీడియో ఒకటి ఇటీవల వైరల్ అయింది.

 

నిజంగా ఆ వీడియో చూస్తే ఎవరికైనా వెన్నుల్లో వణుకు పుడుతుంది.  ఎవరూ లేకుండానే యంత్రం దానికదే కదులుతుండటంతో దెయ్యమే కసరత్తు చేస్తోందని ప్రచారం చేశారు. ఇంకేముంది.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో దెయ్యలు తిరుగుతున్నాయని భయంతో వణికిపోయారు అక్కడ జనం. అటు వైపు వెళ్లాలంటేనే వణికిపోయారు.  ఈ ఘటన ఆనోటా ఈ నోట పోలీసులకు తెలిసింది. అక్కడ నిజంగానే  ఏమైనా ఉన్నాయా అని తేల్చాలని రంగంలోకి దిగారు. అయితే అక్కడ ఏం జరుగుతుందో అన్న విషయంపై ఆరా తీశారు..  గట్టు రట్టు చేశారు.

 

ఝాన్సీ ప్రాంతంలోని కాశీరామ్ పార్కులో ఇటీవల ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. ఓ రోజు ఉన్నట్టు ఉండి రాత్రి సమయంలో జిమ్ యంత్రం దానికదే కదిలింది. పోలీసులు దాన్ని క్షుణ్ణంగా గమనించారు.. దానికి ఎవ‌రో ఎక్కువ గ్రీజు రాయడం వల్ల యంత్రం దానికదే కదలడం ప్రారంభమైంది. అది ఆగకుండా నిరంతరం అటూ ఇటూ కదులుతోందని చెప్పారు. అది చూసి నిజంగా దెయ్యం వ్యాయామం చేస్తుందటూ పుకార్లు రేపారు. ప్రజలు భయపడటానికి ఏమి లేదని పోలీసులు తేల్చి ధైర్యం చెప్పారు. దీంతో స్థానికులు అంతా ఊపిరిపీల్చుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: