లాక్ డౌన్ దెబ్బకు సామాన్య ప్రజలు విపరీతంగా ఇబ్బందులు పడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితి కొంచెం మెరుగుపడింది కానీ గడిచిన రెండు నెలలు అయితే పేద ప్రజలు విపరీతమైన ఆకలి కష్టాలు అనుభవించారు. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కరోనా నుండి రక్షణ కోసం లాక్ డౌన్ విధిస్తే అనుకోకుండా ఇదే లాక్ డౌన్ మన దేశానికి ఉగ్రవాదుల నుండి కూడా రక్షణ కల్పించడం విశేషం.

 

అవును లాక్ డౌన్ ని మన భారత సైన్యం చాలా చక్కగా వినియోగించుకున్నారు. గత 15 రోజుల్లో ఏకంగా పాతిక మంది ఉగ్రవాదులు హతం కావడమే అందుకు నిదర్శనం. దాదాపు రెండు నెలలు దేశంలోని రవాణా మార్గాలు స్తంభించి మరియు ఎవరు ఇళ్ళలో లో నుండి పెద్దగా బయటకు రాకపోయేసరికి ఉగ్రవాదులకు సరిహద్దు ప్రాంతాల్లో దాక్కోవడం చాలా కష్టం అయిపోయింది.

 

ప్రజల మధ్య అయితే ఏదో రకంగా నక్కి వెళ్లి తమ అవసరాలను తీర్చుకుంటూ జనసందోహంతో కలిసిపోయిన వారు రెండు నెలలు మాత్రం పడరాని పాట్లు పడ్డారు. వీధంతా పోలీసులు.. సరొహద్దు ప్రాంతాల్లో అయితే మరీ ఎక్కువ. ఇక వారికి భారత సైన్యం నుండి వచ్చే ఆకస్మిక దాడులు నుండి రక్షణగా ఉపయోగపడే ఆయుధాల యొక్క సరఫరా కూడా ఆగిపోయింది.

 

దీంతో వారంతా ఏం చేయాలో పాలుపోలేదు. తప్పటడుగులు వేసి చివరికి భారత సైన్యం చేతిలో చనిపోయారు. ఇక లాక్ డౌన్ ను పూర్తిగా వినియోగించుకున్న మన సిఆర్పిఎఫ్ జవాన్లు మరియు సైనిక దళాలు ఖాళీ రోడ్లలో మరియు నిర్మానుష్య ప్రదేశాలలో ఉగ్రవాదుల ఆచూకీ తెలుసుకుని స్థానికులకు లాక్ డౌఅన్ వల్ల ఎటువంటి రిస్క్ లేదు కాబట్టి పక్కా ప్లాన్ వేసి హతమార్చారు.

 

ఇలా కరోనా సోకకుండానే ఉగ్రవాదులు కుక్క చావు చావడం హర్షణీయమని దేశ ప్రజలంతా ఆనందపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: