మనం పెద్ద పెద్ద గొరిల్లా చిత్రాలు చూశాం.. నిజంగానే కొన్ని గొరిల్లాలు చాలా పెద్దగా చూడటానికి భయంకరంగా ఉంటాయి.. అలాంటి ఓ పెద్ద గొరిల్లాని నలుగురు మనుషులు దారుణంగా హత్య చేశారు.  సాధారణంగా ఉగాండా అంటే చాలా మందికి ఓ రకమైన భయం.. ఇక్కడ కొంత మంది నరమాంస భక్షకులు ఉంటారని టాక్.  మనుషులను దారుణంగా చంపుతారని.. అరాచకాలు ఎక్కువగా ఉంటాయని సోషల్ మీడియాలో పలు కథనాలు కూడా వచ్చాయి.  తాజాగా ఉగాండాలో దారుణం జరిగింది.. ప్రపంచ ప్రఖ్యాత‌ గొరిల్లా ర‌ఫికి హ‌త్య‌కు గురైంది.

IHG

న‌లుగురు వేటగాళ్లు క‌లిసి గొరిల్లాను హ‌త్య చేశారు. ఈ ఘోర సంఘటన ఉగాండాలోని బ్విండి ఇంపినిట్రేబుల్‌ నేషనల్‌ పార్కులో ఈ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. రఫికి అనే ప్రపంచ ప్రఖ్యాత సిల్వర్‌ బ్యాక్‌ గొరిల్లా ఉగాండాలోని బ్విండి ఇంపినిట్రేబుల్‌ నేషనల్ పార్కులో ఉండేది. ఆ 25 ఏండ్ల‌ మగ గొరిల్లా ప్రమాదంలో పడిన‌ కొండజాతి గొరిల్లాలకు నాయకుడుగా ఉండేది.అయితే, కొద్దిరోజుల క్రితం నలుగురు వేటగాళ్లు గొరిల్లా రఫికిని చంపేసినట్లు ఉగాండా వైల్డ్‌లైఫ్‌ అథారిటీ అధికారులు ప్రకటించారు.

IHG

ఆ గొరిల్లాను హత్య చేసిన వారిలో ఒకరిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  అయితే అదుపులో ఉన్న ఆ నింధితులు మాత్రం తమకు ప్రాణ హాని ఉందని భావించిన తర్వాత ఆ గొరిల్లాను హత్య చేశామని.. బయామికామా ఫెలిక్స్‌ అనే వేటగాడు అంగీకరించాడు. రఫికిని చంపిన కేసులో ఆ నలుగురు వేటగాళ్లకు జీవితఖైదు పడుతుంద‌ని ఉగాండా పోలీసులు తెలిపారు.  ఏది ఏమైనా ఈ మద్య మానవ మృగాలు మూగ జీవాలను దారుణంగా చంపేస్తున్నారని నెటిజన్లు వాపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: