భారత్ పాక్ శత్రు దేశాలు అన్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసు. పాక్ ఎల్లప్పుడూ భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంటుంది. తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ తమను చూసి నేర్చుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో పేదల ప్రయోజనం కోసం నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కోటి కుటుంబాలకు తొమ్మిది వారాల్లో 12,000 కోట్ల రూపాయలను ఎటువంటి అవకతవకలు లేకుండా పంచామని వ్యాఖ్యలు చేశారు. 
 
తమ కార్యక్రమం అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుందని పేర్కొన్నారు. నగదు బదిలీ కోసం పాక్‌లో వినియోగిస్తున్న సాంకేతికత వివరాలను భారత్‌లో పంచుకునేందుకు సిద్ధమేనని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు వింటే చింత చచ్చినా పులుపు చావలేదనే సామెత గుర్తొస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇటీవల పాక్ కు భారత్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను పంపింది. పాక్ ప్రజలు తినడానికి గోధుమ పిండిని కూడా భారత్ పంపింది. 
 
భారత్ సైన్యం చేతిలో పాక్ ఉగ్రవాదులు హతమవుతున్న వార్తలు ప్రతిరోజూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పాక్ భారతదేశానికి సహాయం చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం. పాకిస్తాన్ లో కరోనా రోగుల కోసం ఆస్పత్రులు, వెంటిలేటర్లు లేక ఊరి చివరన శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్న దుస్థితిలో పాక్ ఉంది. పాక్ లో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. అయినా కుక్క తోక వంకర అనేలా భారత్ కు సహాయం చేస్తానంటూ వ్యాఖ్యలు చేసి పాక్ తన వక్ర బుద్ధిని ప్రదర్శిస్తోంది. సోషల్ మీడియాలో ఇమ్రాన్ ఖాన్ భారత్ కు సహాయం చేస్తామనడంతో ఆయన భలే జోక్ వేశారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. 
 
భారత్ పై పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను అక్కడి ప్రజలే పట్టించుకోకపోవడం గమనార్హం. పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు భారత్ కూడా అదే స్థాయిలో బదులిచ్చింది. భారత్ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ విలువే పాక్ జీడీపీతో సమానం అని భారత్ తిప్పిగొట్టింది. జీడీపీలో 90 శాతానికి సమానమైన అప్పులతో పాక్ రుణాల ఊబిలో కూరుకుపోయిందని.... సరైన సమాచారం కోసం ఇమ్రాన్ ఖాన్ తన సలహాదారుల బృందాన్ని మారిస్తే బాగుంటుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: