తల్లిదండ్రులకు పిల్లను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో కొన్ని సంఘటనలు చూస్తుంటే తెలుస్తుంది. దేశ వ్యాప్తంగా ఎన్నో బోరు బావి సంఘటనలు ఇందుకు ఉదాహారణ.  తెలిసీ తెలియక చిన్న పిల్లలు ప్రమాదాలు కోరి తెచ్చుకుంటారు.  అయితే అది ప్రమాదం అని వాటి జోలికి వెళ్లొద్దని పిల్లలకు తల్లిదండ్రులు జాగ్రత్తగా అర్థమయ్యేలా చెప్పాలి.  కొంత మంది పిల్లలు అర్థం చేసుకుంటారు.. మరికొంత మంది పిల్లలు ఏంటో అని ఉత్సాహంగా వద్దన్న పనులు చేస్తుంటారు. కొన్ని సార్లు పిల్లలు వంటింట్లో సామాన్లతో ఆడుకుంటారు.. ఆ సమయంలో కత్తులు ఇతర పదునైన వస్తువులు ఉంటాయి. వాటి వల్ల చాలా ప్రమాదం ఉంటుంది.. తాజాగా వంటింట్లో ఉన్న ప్రెజర్ కుక్కర్‌‌తో ఆడుకుంటూ ఓ చిన్నారి ప్రమాద బారిన పడింది.

 

కుక్కర్ లోపల తల పెట్టడంతో అది ఇరుక్కుపోయింది.  దాంతో ఆ చిన్నారి విల విలలాడింది.. ఇక తల్లిదండ్రుల పరిస్థితి వర్ణణాతీతంగా తయారైంది. వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో చివరకు వెల్డింగ్ చేసే వ్యక్తిని పిలిపించి చాకచక్యంగా దాన్ని కోసేశారు. దీంతో ఆ చిన్నారి ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకుంది.  ఈ సంఘటన గుజరాత్‌లోని భావ్‌నగర్‌ చోటు చేసుకుంది. ఏడాది వయసున్న బాలిక‌  వంటింట్లోకి వెళ్లి కుక్కర్ బౌలు తీసుకుంది. దాన్ని హెల్మెట్ మాదిరిగా ధ‌రించేందుకు తలపై పెట్టుకుంది. తల కాస్త అందులో ఇరికి పోయింది.. బయటకు రాలేదు.

 

చిన్నారిని ఆ పరిస్థితుల్లో చూసిన తల్లిదండ్రులు తమ బిడ్డకు ఏమౌతుదోనని తెగ భయపడిపోయారు. తల్లిదండ్రులు ఈ విషయం గమనించి లాగే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. డాక్టర్ ని పిలిచారు.. అతని వల్ల కూడా కాలేదు. ఇక లాభం లేదని వెల్డ‌ర్‌ను పి‌లిపించి జాగ్రత్తగా కుక్క‌ర్ క‌ట్ చేయించారు. దీంతో ఆ చిన్నారి త‌ల కుక్క‌ర్ నుంచి వేర‌య్యింది. కాకపోతే అది కాస్త రాజుకోవడం వల్ల గాయం అయ్యింది. ఏ మాత్రం ఆలస్యం చేసినా ప్రాణాలకు ముప్పు ఉండేదని వైద్యులు వెల్లడించారు. ప్ర‌స్తుతం ఆ బాలికకు చికిత్స అందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: