ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైంది. ఏడాది పాలనలో సంక్షేమ పథకాల అమలుతో సీఎం జగన్ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే త్వరలో జగన్ కేబినెట్ లో మార్పులు చేయబోతున్నారని వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నెల 19న రాజ్యసభ ఎన్నికలు జరగనుండటం... మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు ఎంపిక చేయడంతో వారు వారి పదవులకు రాజీనామా చేయనున్నారు. 
 
వీరి స్థానాలను ఎవరితో భర్తీ చేస్తారనే ప్రశ్నకు వైసీపీ వర్గాల్లో చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ఈ పేర్లలో నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. శెట్టిబలిజ కులం నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ ను ఎంపిక చేసుకోవడంతో అదే నియోజకవర్గం నుంచి గతంలో గెలుపొంది జడ్పీటీసీ ఛైర్మన్ గా చేసిన వేణుకు మంత్రి పదవి ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది. మత్స్యకార సామాజికవర్గం నుంచి వచ్చిన వ్యక్తి మోపిదేవి వెంకటరమణ కాబట్టి ఆ సామాజిక వర్గం నుంచి వైసీపీలో ఎవరూ లేకపోవడంతో విడుదల రజినీకి కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
పార్టీని సుదీర్ఘ కాలం నుంచి నమ్ముకున్న నగరి ఎమ్మెల్యే రోజాకు కూడా కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం.... ప్రజల్లో మంచి గుర్తింపు ఉండటం..... గతంలో కేబినెట్ లో ఆమెకు కేబినెట్ లో చోటు దక్కుతుందని వార్తలు రావడం.... ఇతర కారణాల వల్ల రోజాకు కేబినెట్ లో చోటు దక్కే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ గతంలో కొందరికి మంత్రి పదవులు ఇస్తానని హామీ ఇచ్చారని వాళ్లలో రోజా, అంబటి ఉండటంతో వీరికే కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

 
అంబటి రాంబాబుకు కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వైసీపీ పార్టీ విజయం కోసం కృషి చేసిన వ్యక్తులలో అంబటి ముందువరసలో ఉంటారు. ఈ నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఉండటంతో జగన్ వీళ్లలో ఎవరికి అవకాశం ఇస్తాడో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: