రాజకీయ నాయకులూ.. కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ..తమిళనాడు, మహారాష్ట్రల్లో కొందరు నాయకుల కరోనా సోకింది. ఇప్పుడు.. తెలంగాణలో .. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి  ఈ వైరస్ బాధితుడయ్యారు. ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు .   ఎమ్మెల్యేకు  పాజిటివ్ రావడంతో... జనగామ జిల్లా అధికారులతో పాటు అధికార పార్టీ నేతల్లో కలవరం మొదలైంది. 

 

నిన్న మొన్నటి వరకు వాలుస కూలీలకు.. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారికె కరోనా పాజిటివ్ వచ్చింది..   కానీ ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. గత మూడు రోజులుగా స్వల్ప అనారోగ్యంగా  ఉన్న ముత్తి రెడ్డి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేరారు.  జ్వరం,  జలుబుతో ఇబ్బంది పడ్డ యాదగిరి రెడ్డికి కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దింతో ఆయన  యశోద  ఆస్పత్రిలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.. 

 

టీఆర్ఎస్  ఎమ్మెల్యే యాదగిరి రెడ్డికి పాజిటివ్ అని తెలియగానే జనగామ జిల్లా అధికారులు.. ప్రజా ప్రతినిధుల్లో ఒకసారి  టెన్షన్ మొదలైంది.. ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది తో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఇప్పటికే సెల్ఫ్ క్వారం టైన్ లో ఉండాలని సూచించారు.  ఇక ఎమ్మెల్యేతో సమీక్ష సమావేశాల్లో పాల్గొన్న అధికారు ల్లో  కలవరం మొదలైంది.  ఎక్కడ తమకు ఈ కరోనా సోకి ఉంటుందో అన్న భయం వారిని వెంటాడుతోంది.   వారం క్రితం జిల్లా  కేంద్రంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో  ఎమ్మెల్యే పాల్గొన్నారు.  

 

లాక్ డౌన్ ముందు  జనగామ జిల్లో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ సడలించింన  తర్వాత మరో రెండు పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. జనగామ లో మొదలు రెండు పాజిటివ్ కేసులు నమోదు కాగానే కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యిందా అని తెలుసుకునేందుకు  పది రోజుల క్రితం   ర్యాండం టెస్టులు నిర్వహించారు.   జనగామ జిల్లాలో కరోనా  అదుపులోనే ఉంది అని  అధికారులు చెప్పిన రెండు మూడు రోజుల్లోనే అధికార పార్టీ ఎమ్మెల్యే నే  కరోనా బారిన పడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: