సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో చిత్ర విచిత్రాలు చూస్తున్నాం. ఆ మద్య కొన్ని ఇండ్లు సముద్ర గర్భంలో ఇట్టే కలిసిపోతున్న వ్యూజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.  మొదట ఇది గ్రాఫిక్స్ అనుకున్నారు.. కానీ నిజమైన దృష్యం అని తేల్చి చెప్పారు.   నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం ఇరిగేషన్‌ కెనాల్‌లో పడిపోయిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో జరిగింది.  బిల్డింగ్‌ కాల్వలో పడిపోతుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  కోల్‌కతాకు 120 కిలోమీటర్ల దూరంలో..మిడ్నాపూర్‌ జిల్లాలోని నిశ్చింతపూర్‌ గ్రామంలో ఈ భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.  ఇటీవల వర్షాలు పోటెత్తడంతో కాలువలో పూడిక ఏర్పడింది. దాన్ని శుభ్రం చేస్తుంగా పక్కనే ఉన్న భవనం పునాది కదిలిపోయాయి భవనం కాస్తా కుప్పకూలి కాలువలో పడిపోయింది.

 

పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లా నిశ్చితంపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలోనే కూలిపోవడంతో మంచి పనే జరిగిందే, అందులో సంసారాలు ఉండుంటే భారీ ప్రాణనష్టం సంభవించేందని జనం ఊపిరి పీల్చుకున్నారు.  అయితే భారీ వర్షాలకు కొన్ని కట్టడాలు కూలిపోవడం సహజం.. ఇలా ఎన్నోె కట్టడాలు కూలిపోయిన విషయం తెలిసిందే.  పునాదులు మరింత బలహీనంగా మారడం, కెనాల్‌ శుభ్రంతో ఈ బిల్డింగ్‌ కాస్త కూలి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా ఈ భవనం నిర్మాణం చేపట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో ఈ ఘటన జరిగింది. 

 

నిజానికి ఈ భవనానికి కొన్ని రోజుల కిందలే పగుళ్లు ఏర్పాడ్డాయ, చెప్పినా పట్టించోలేదని స్థానికులు అంటున్నారు. కూలిందే కూలిందిగాని, ఎవరూ చచ్చిపోలేదు కదా అని యజమానులు కూడా తేలిగ్గా తీసుకున్నారు. అయితే అధికారులు మాత్రం విచారణ ప్రారంభించారు.  తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: