ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి చిగురుటాకులా వణికిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను నియంత్రించడం సాధ్యమవుతుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. పలు దేశాల వ్యాక్సిన్లు ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తుండగా త్వరలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
అమెరికాలో కరోనాకు వ్యాక్సిన్ ఇప్పటికే సిద్ధమైందని.... వ్యాక్సిన్ కు సంబంధించిన పరిశోధనలు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇప్పటికే చేసిన క్లినికల్ ట్రయల్స్ లో మంచి ఫలితాలు వచ్చాయని.... తుది దశలో 30,000 మందిపై ఒకేసారి వ్యాక్సిన్ ను ప్రయోగించబోతున్నారని తెలుస్తోంది. స్వచ్ఛందంగా ముందుకు వారిపై శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించబోతున్నారని తెలుస్తోంది. 
 
వ్యాక్సిన్ వేసిన అనంతరం వారి శరీరంలో కరోనా వైరస్ ను ప్రవేశపెడతారు. ఈ వ్యాక్సిన్ వైరస్ ను కంట్రోల్ చేస్తుందా.... ? లేదా...? తుది దశ ప్రయోగాల్లో తేలనుంది. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత వేరే వారికి కరోనా సోకుతుందా....? లేదా....? అనే అంశాలపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల ఫలితాల గురించి వచ్చే నెలలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాక్సిన్ సక్సెస్ అయితే కరోనాను నియంత్రించడం సాధ్యమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,000కు పైగా కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 3,08,993కు చేరింది. వీరిలో 1,45,774 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 8,884 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో మరోసారి లాక్ డౌన్ ను అమలు చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: