అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడు అశ్విత్ రెడ్డి అరెస్టు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కీలక ఈ పరిణామాలకు చోటు చేసుకుంటోంది. వైయస్ జగన్ ప్రత్యర్థి నాయకుల పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చేతిలో అధికారం ఉంది కదా అని రెచ్చిపోతున్నారు అని టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో సోదరుడు అరెస్టు కావడంతో జేసీ దివాకర్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఆరోపణలు వచ్చిన మాట వాస్తవమే కానీ అశ్విత్ రెడ్డిని  ఎందుకు అరెస్టు చేశారో ఎవరికీ తెలియదని దీనిపై న్యాయపోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు.

 

జగన్ కక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ అధికారులు కూడా జగన్ అంటే భయపడుతున్నారు అని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ఇదే సమయంలో చంద్రబాబు మరియు నారా లోకేష్ గురించి కూడా ప్రస్తావించారు. ఇంత అధికారం ఉన్నా నారా లోకేష్ మరియు చంద్రబాబు నాయుడు ని జగన్ టచ్ చేయకపోవడానికి కారణం అయినా అగ్నిగోళం లాంటివాడిని జెసి దివాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబును అరెస్టు చేస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందనే ఉద్దేశంతో… ఆయనను ఒంటరి చేయడానికి ఆయన చుట్టూ ఉన్న బలమైన నేతలను లేకుండా చేయటం లో భాగమే తన సోదరుడు అరెస్టు అని జెసి దివాకర్ రెడ్డి తెలిపారు.

 

వైయస్ జగన్ ని కంట్రోల్ చేయాలంటే ఎవరి వల్ల కాదు అని ఒకే ఒక్కడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వల్ల మాత్రమే అవుతోందని అన్నారు. వైయస్ జగన్ కళ్ళలో ఎవరు పడకూడదని… పడితే ఇలానే ఉంటుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో నేను కూడా అరెస్టు అయ్యే అవకాశం ఉండవచ్చేమో అనుమానాన్ని జెసి దివాకర్ రెడ్డి లేవనెత్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: