ప్రపంచాన్ని మొత్తం అల్లకల్లోలం చేస్తూ ఎంతో మందిని పొట్టనబెట్టుకున్నది మహమ్మారి కరోనా. చైనాలో వెలుగులోకి వచ్చి అక్కడ ప్రస్తుతం తగ్గింది కానీ ప్రపంచ దేశాల్లో మాత్రం పంజా విసురుతోంది. దీంతో ప్రపంచ దేశాలు ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతూ అతలా కుతలం  అవుతున్నాయి. మనిషి జీవన  శైలి ని అతలాకుతలం చేస్తోంది ఈ మహామ్మారీ  వైరస్. అయితే ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం కోరలు  చాస్తూ ఎంతోమందిని మృత్యువుతో పోరాడేలా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మొదట జలుబు దగ్గు జ్వరం లాంటి లక్షణాలు ఈ మహమ్మారి వైరస్ సోకితే వచ్చేవి. 

 


 కానీ రాను రాను ఈ మహమ్మారి వైరస్ సోకితే వచ్చే లక్షణాలలో  కూడా మార్పులు వచ్చాయి. అలసట శ్వాస తీసుకోలేకపోవడం గొంతు నొప్పి విరేచనాలు వంటి సమస్యలు కూడా ఈ వైరస్ లక్షణాలు గా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. క్రమక్రమంగా అధ్యయనాలలో  సరికొత్త లక్షణాలు కూడా ఈ వైరస్ కు సంబంధించి బయటపడుతూ వచ్చాయి. తాజా అధ్యయనంలో ఈ వైరస్ బారిన పడిన వారికి మరికొన్ని లక్షణాలు కూడా ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. ఉన్నట్టుండి వాసన రుచి చూసే శక్తి కోల్పోవడం కూడా ఈ మహమ్మారి వైరస్ లక్షణాలుగా  పేర్కొనవచ్చు అంటూ తెలిపారు
 శాస్త్రవేత్తలు. 

 

 క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ కోవిడ్ 19 అనే ప్రత్యేక డాక్యుమెంట్లు ఈ మేరకు ప్రచురించారు. ఇక ఈ ప్రత్యేక పత్రాన్ని దేశ వ్యాప్తంగా వైద్య నిపుణులు సందేహ నివృత్తికోసం పంపించనున్నట్లు తెలుస్తోంది. వాసనలు గుర్తించకపోవడం రుచి గుర్తించకపోవటం  లాంటివి కూడా ఈ మహమ్మారి వైరస్ లక్షణాలు అయి ఉండవచ్చు అని కేంద్రం కూడా అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మహమ్మారి వైరస్ లక్షణాలు కనబడితే వెంటనే ఆసుపత్రికి వెళ్లి కరోనా నిర్దారిత   పరీక్షలు చేసుకోవాలి అంటూ సూచిస్తున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: