దేశంలో కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విధ్వంసం గురించి అందరికీ తెలిసిందే. అయితే దేశ ప్రజలందరికీ ఇప్పుడు త్వరలోనే గుడ్ న్యూస్ వెళ్ళిపోతున్నారు. మరొక నాలుగు వారాల్లో వైరస్ చికిత్స కు మందులు అందుబాటులో ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైరస్ చికిత్స కోసం వైరస్ చికిత్స కోసం రెమిడెస్విర్, ఫావిపిరావిర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ లు ఉపయోగపడతాయని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కొద్ది నెలల కిందట గుర్తించిన విషయం తెలిసిందే. వీటిల్లో రెమిడెస్ విర్ ఫావిపిరావిర్పై దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలైన సిప్లా గ్లెన్ మార్క్ లు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాయి.

 

ఇదిలా ఉండగా మందులను ఉపయోగించిన వంద మంది రోగుల్లో కనీసం 60 నుండి 70 శాతం మంది యొక్క పరిస్థితి మెరుగుపడగా మిగిలిన వారిలో కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని వారు పేర్కొన్నారు. వ్యాధి యొక్క తీవ్రత పెరిగే కొద్దీ పేషెంట్ కి ఇవ్వవలసిన మందు యొక్క రకాన్ని మార్చవలసి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫాపివిరావిర్ ను అయితే జపాన్ లో సుమారు 70 వేల మంది రోగులకు అందించి సత్ఫలితాలు రాబట్టారని మరియు రష్యా లో కూడా దీని వాడకానికి అనుమతులు లభించాయి ఒక శాస్త్రవేత్త చెప్పారు.

 

అన్నీ దేశాల్లో త్వరగానే దీని టెస్టింగ్ ప్రారంభం భారత్ లో మానవ ప్రయోగాల దశకు చేరుకునేటప్పటికీ ప్రాజెక్టు ఆలస్యం అయ్యింది. అందుకే భారత్ లో దీన్ని ప్రయోగించడం ఆలస్యం కాగా ఇప్పుడు దీని పని తీరును గమనించాలని డ్రగ్ కంట్రోల్ నిర్ణయించడం గమనార్హం. అయితే కరోనా రోగులతో వైద్యులు క్షణం తీరికలేని పరిస్థితులు ఏర్పడటం.. మందులను రోగులకు ఇచ్చి వాటి ఫలితాలను సమాచారాన్ని నమోదు చేసే అవకాశం లేకపోవడంతో ఇంకాస్త ఆలస్యమైంది.

 

ఇక రోగుల దగ్గర నుండి కూడా కొత్త మందులను ఉపయోగించేందుకు కొద్దొగా వ్యతిరేకత వస్తోంది. డ్రగ్ కంట్రోలర్ సమాచారాన్ని విశ్లేషించి చివరికి వాటి వాడకానికి అనుమతులిస్తే వైరస్ పై పోరులో కొత్త అధ్యాయం మొదలైనట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: