ఏపీ రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి. మాజీ మంత్రి అచ్చెన్నాయుదు ఎక్కడో నిమ్మాడలో సొంతూళ్ళో ఉన్నారు. ఆయన్ని ఒక ఉదయం హఠాత్తుగా ఏసీబీ అధికారులు  అరెస్ట్ చేసి విజయవాడకు సాయంత్రానికి తెచ్చారు. ఇంత పెద్ద ఆపరేషన్ జరిగితే ఏపీలోని  ప్రభుత్వంలో ఒకరిద్దరికి తప్ప ఎవరికీ తెలియనంత  గుట్టుగా జరిగింది అని ప్రచారంలో ఉంది.

 

మొత్తానికి అచ్చెన్నాయుడు ఎపిసోడ్ నిన్న జాతీయ స్థాయిలో టాప్ రేంజి న్యూస్ అయింది. ఇపుడు ఆయన్ని రిమాండ్ లో  ఉంచి ఆసుపత్రికి ఆరోగ్యసమస్యల మీద తరలించారు. సరే అచ్చెన్నాయుడు విషయం ఇలా ఉంటే ఈఎస్ఐ కుంభకోణలో 151 కోట్ల అవినీతి జరిగింది అని ఏసీపీ అధికారులు చెబుతున్నారు. మరిన్ని అరెస్టులు ఉంటాయని కూడా చెబుతున్నారు.

 

మరో వైపు చూస్తే అచ్చెన్నాయుడు అప్రూవర్ గా మారాలని, ఆయన వెనక పెద్ద తలకాయలు ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. అచ్చెన్నకు బఠాణీలు మాత్రమే దక్కాయని మంత్రి పేర్ని నాని అంటున్నారు. అచ్చెన్న వాస్తవాలు ఇకనైనా వెల్లడించాలని, అసలు దోషులు ముందుకు వచ్చేలా  అప్రూవర్ గా మారాలని కూడా అంటున్నారు.

 

మరి అచ్చెన్న ఈ కేసు విషయంలో అప్రూవర్ గా మారుతారా. అన్న చర్చ రాజకీయాల్లో జోరుగా  సాగుతోంది. ఎందుకంటే అధికారులకు అచ్చెన్న సిఫార్స్ లేఖ రాసిన దానిమీదనే అరెస్ట్ చేశామని ఏసీబీ అధికారులు అంటున్నారు. అంటే అచ్చెన్న ఇపుడు లెటర్ ఆధారంగానే చిక్కుల్లో పడ్డారని అర్ధమవుతోంది. ఇపుడు అచ్చెన్నను ఆ విధంగా ఎవరు ప్రేరేపించారు. ఎవరి కోసం అచ్చెన్న ఇలా లెటర్ రాయాల్సివచ్చిందన్నది  అప్రూవర్ గా మారి చెప్పమంటున్నారు వైసీపీ నేతలు.

 

అచ్చెన్న అప్రూవర్ అయితే పెద్ద తలకాయలు బయటకు వస్తాయని అంటున్నారు. మరి ఈ కేసు విషయంలో అచ్చెన్న అలా చేస్తారా. ఆయన కుటుంబం మొత్తం టీడీపీకే అంకితం అయిన సందర్భం ఉంది. అటువంటిది ఆయన అప్రూవర్ గా మారడం అంటే జరిగే పని కాదు కానీ వైసీపీ నేతల అనుమానాలు మాత్రం టీడీపీలో ఇంకా పెద్ద తలకాయల మీదనే ఉన్నాయి. మరి వైసీపీ గురి పెట్టిన వారు సీన్లోకి వస్తారా చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: