రాజకీయాల్లో ఎన్నో చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు కేసులతో రాజకీయాలు చేస్తూ ఉంటే.. మరికొన్ని సార్లు రాజకీయాల ద్వారా కేసులు జరుగుతూ  ఉంటాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇలాంటి వ్యవహారమే జరుగుతుంది. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వ్యవహారంలో... అధికారపక్షం ఏదైతే చట్టపరంగా ఓ అంశాన్ని  తెరమీదకు తెచ్చిందో దాన్ని బేస్ చేసుకుని.. టీడీపీతో పాటు సోషల్ మీడియాలో కూడా అధికార పార్టీపై విమర్శలు వస్తున్నాయి. అంతకు ముందు కేసుల ద్వారా ప్రతిపక్ష పార్టీ రాజకీయం చేస్తే.. ప్రస్తుతం అదే కేసులు ద్వారా రాజకీయం మొదలు పెట్టింది అధికార పార్టీ అని అంటున్నారు విశ్లేషకులు. 

 

 మొన్నటి వరకూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశంలో  అన్యాయం జరిగిందని రాజ్యాంగ ప్రకారం కరెక్ట్ కాదు అని ఆరోపణలు చేశారు. ఇప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అనే కొత్త రాజ్యాంగం వచ్చింది అని టిడిపి నేతలు కొందరు విమర్శలు చేస్తున్నారు. ఎందుకు ఇలా అంటున్నారు అంటే ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో అచ్చన్నాయుడు,  జెసి దివాకర్ రెడ్డి లాంటి కీలక నేతల అరెస్టులు కావడమే ఇందుకు కారణం. ఇక ఇలా టిడిపి నేతల అరెస్టులు జరిగాయో లేదో.. మొన్నటి వరకు ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉన్న డాక్టర్ సుధాకర్,  నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులు తెలుగుదేశం పార్టీ పట్టించుకోవడం మానేసింది అంటున్నారు విశ్లేషకులు. 

 


 నిమ్మగడ్డ కేసు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది అని అనుకుంటున్న తరుణంలో టిడిపి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఇదే సమయంలో టిడిపి కీలక నేతల అరెస్టులు కావడం తో నిమ్మగడ్డ  వ్యవహారం కాస్త పక్కకు వెళ్లిపోయింది. అయితే గతంలో కేసులు ద్వారా అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీ ప్రయత్నించగా... ప్రస్తుతం అదే కేసుల ద్వారా ప్రతిపక్షాన్ని ఇరకాటంలో పడేలా చేస్తుంది జగన్ సర్కార్ అని అంటున్నారు విశ్లేషకులు. మరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: