ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకు మారిపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టిడిపి పార్టీకి రోజురోజుకు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో  గడ్డు పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు విశ్లేషకులు. టిడిపి పార్టీ నుంచి ఎవరు ఎప్పుడు ఇతర పార్టీల వైపు ఎగిరిపోతారో  చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు వరుస షాకులు తగులుతున్న విషయం తెలిసిందే.  కొంతమంది టిడిపి నేతలు వైసీపీ పార్టీ వైపు వెళ్లడం.. టిడిపికి వ్యతిరేకిస్తూ వైసీపీ పార్టీ కి సప్పోర్ట్  చేస్తున్నారు. 

 

 తాజాగా టీడీపీ పార్టీకి చెందిన కొంతమంది నేతలు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నట్లు  తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించిన ప్రచారం హల్చల్ చేస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం టిడిపి పార్టీలోనే కీలక  నేతలందరికీ వైసీపీ ప్రభుత్వం షాకుల మీద షాకులు ఇస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో టిడిపి పార్టీ నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకున్న నేతల జోలికి మాత్రం ఇప్పటి వరకు అధికార పార్టీ వెళ్ళ  లేదు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు అయినటువంటి నలుగురు కమలం తీర్థం పుచ్చుకోగ...  ఇందులో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారే. వీరిపై గతంలో వైసీపీ పార్టీ ఎన్నో ఆరోపణలు చేసింది. ఎన్నో విమర్శలు కూడా చేసింది. 

 


 అయితే ప్రస్తుతం జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి కేసులు వేయడం కానీ.. అకస్మాత్తుగా అరెస్టులు చేయడం గానీ చేయలేదు అధికారపార్టీ. అంటే టిడిపి నుంచి బీజేపీ పార్టీలో చేరితే వైసీపీ పార్టీ నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది అన్నది ప్రస్తుతం నేతల్లో నెలకొన్న  అభిప్రాయం.  బీజేపీ నేతలు వైసీపీ ని విమర్శిస్తున్నప్పటికీ వాళ్ళ జోలికి మాత్రం వెళ్లడం లేదు వైసిపి పార్టీ. దీంతో జగన్ సర్కార్ కి ఉన్న నాలుగేళ్లలో టిడిపి పార్టీ లో  ఉంటే ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉందని అందుకే బీజేపీ పార్టీ వైపు వెళ్తే సేఫ్ జోన్ లో ఉన్నట్లే అని అనుకుంటున్నారట టిడిపి నేతలు. ఈ నేపథ్యంలోనే టిడిపి పార్టీకి చెందిన మాజీ మంత్రి... ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు కూడా బిజెపి పార్టీ వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని ప్రచారం ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో ఊపందుకుంది. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం రానున్న రోజుల్లో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: