ప్రస్తుతం ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ నేరాన్ని నేరంగా పరిగణించడం కంటే ఆ నేరానికి కులం మతం అనే రంగులు పులమటం  మాత్రమే ఎక్కువ జరిగిపోతుంది దేశంలో. ప్రస్తుతం అమెరికాలో ఇలాంటివి దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన విషయం తెలిసిందే. ఒక వ్యక్తిని పోలీసులు చంపడం తప్పే.. కానీ ఆ నేరాన్ని ఏకంగా జాతి వివక్ష కింద తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసేలా చేస్తున్నారు ప్రస్తుతం  అమెరికా లో. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కులం మతం లాంటివి  పలు అంశాలలో వాడుతున్నారు అని అంటున్నారు విశ్లేషకులు. 

 

 ప్రస్తుతం టీడీపీ కీలక నేత అచ్చెన్నాయుడు వ్యవహారంలో టిడిపి కులస్తుడని అక్రమ అరెస్ట్ లు చేసారు  ఆరోపించిన విషయం తెలిసిందే.. గతంలో డాక్టర్ సుధాకర్ అరెస్టు విషయంలో కూడా ఇలాంటి కులాస్త్రాన్ని వాడింది  టిడిపి పార్టీ. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన అతనిపై వచ్చిన  ఆరోపణలు... ఆ తర్వాత కోర్టులో  వచ్చే జడ్జిమెంట్... ఇలా చూడడం మానేసి ఏకంగా బిసి కులానికి చెందిన వాడు కాబట్టి అచ్చన్నాయుడు ఇలా అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారు అంటూ సరికొత్త కోణాన్ని తెరమీదికి తెచ్చింది టీడీపీ. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి కొడాలి నాని టిడిపి కి కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏ కులం వాళ్లని అరెస్టు చేయాలో లిస్ట్ ఇస్తే  వాళ్ళని మాత్రమే అరెస్టు చేస్తాం అంటూ చెప్పారు. 

 


 ప్రస్తుతం బిసి కులానికి చెందిన నాయకుల పై ప్రభుత్వం కక్ష కట్టింది అని అంటున్న నాయకులు... ఈబిసి రిజర్వేషన్ల గురించి మాత్రం మాట్లాడారు అని అంటున్నారు విశ్లేషకులు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈబిసి రిజర్వేషన్ లు ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఒక వర్గం మీద ప్రేమ ఉంటే రిజర్వేషన్లు కోల్పోయినటువంటి వారి  గురించి మాట్లాడాలి అంటున్నారు విశ్లేషకులు. అంతే తప్ప ఇలా అరెస్టుల విషయంలో మాత్రం కులాలను తీసుకువచ్చి రచ్చ చేయడం సరైనది కాదు అంటున్నారు. ఇలా రాజకీయాల కోసం కులాలను వాడుకొని కులాల మధ్య చిచ్చుపెట్టి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడేలా చేయడం సరైనది కాదు అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: