ఒక వ్యక్తిలోని నాయకత్వ లక్షణాలు ఏదైనా సంక్షోభం ఏర్పడినప్పుడు మాత్రమే బయటపడతాయి అని అంటూ ఉంటారు. ఏదైనా సంక్షోభం ఏర్పడినప్పుడు ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి... పదునైన ప్రణాళికలతో అందరిలో ధైర్యాన్ని నింపి ముందుకు నడిపించే వాడు అసలు సిసలైన లీడర్  ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇలాంటి లీడర్ అనే విషయం తెలిసిందే. ఎలాంటి సంక్షోభంలో అయిన పార్టీ నేతలు అందరిలో ధైర్యాన్ని నింపి తనదైన వ్యూహంతో ముందుకు సాగేలా చేస్తూ ఉంటాడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. అయితే టిడిపి పార్టీకి చంద్రబాబు నాయుడు తర్వాత అలాంటి లీడర్ ఎవరు అన్న ప్రశ్న ప్రస్తుతం నెలకొన్న విషయం తెలిసిందే.

 


 ప్రస్తుతం చంద్రబాబు నాయుడు వారసుడుగా నారా లోకేష్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ ఆయనలో సరైన నాయకత్వ లక్షణాలు లేవు అని ఎంతో మంది నేతలు ఎంతగానో దిగులు చెందారు. ఈ క్రమంలోనే  కొంతమంది నేతలు అధికార పార్టీ వైపు ఇంకొంతమంది జనసేన బిజెపి పార్టీ వైపు వెళ్లేందుకు సిద్ధపడటం కూడా ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో  చూశాము. అయితే తాజాగా చంద్రబాబు రాజకీయ వారసుడు అయిన నారా లోకేష్ వ్యవహరించిన తీరు మాత్రం ఆయనలోని సరికొత్త లీడర్ ప్రస్తుతం పార్టీ నేతలకు పరిచయం చేసింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

 


 ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో టీడీపీ కీలక నేత లకు సంబంధించిన అరెస్ట్ లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య చంద్రబాబు వయస్సు  ప్రకారం ఎక్కడికి వెళ్లే అవకాశం లేదు కాబట్టి లోకేష్ ఆగమేఘాల మీద రంగంలోకి దిగడం ఆ తర్వాత స్టేట్మెంట్లు కామెంట్లు అంటూ ఎంతో  వ్యూహాత్మకంగా వ్యవరించడం.. ఆ తర్వాత ఈ అరెస్టులను బిసి రాజకీయం వైపు తీసుకెళ్లడం.. అచ్చన్నాయుడు పరామర్శించడానికి వెళ్లడం.. మరోవైపు న్యాయవాదులను పంపించడం.. న్యాయవాదుల ను లోపలికి పంపించకపోతే నినాదాలు చేయడం.. న్యాయవాది అనుమతించేలా చేసి బెయిల్ మంజూరు అయ్యేలా చేయడం.. తర్వాత హాస్పిటల్ కి వెళ్లి అక్కడ పరామర్శించేందుకు అనుమతించకపోవడంతో అక్కడ నిరసన తెలపడం.. ఇలా ఎంతో వ్యూహాత్మకంగా  వ్యవహరించి.. లోకేష్ నుంచి సరికొత్త లీడర్ నేతలకు పరిచయం చేశారు అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: