ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను పరిశీలించినట్లయితే తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం చాలా రోజుల తర్వాత తమ గొంతు ని లేవనెత్తింది. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక మూడు రాజధానులు విషయంలో తప్పించి ఎక్కడా కూడా టిడిపి మద్దతుదారులు నుండి గాని కార్యకర్తలు నుండి గాని పెద్దగా సౌండ్ లేదు. జగన్ చాలా అప్రమత్తంగా ఉంటూ మరియు దూకుడుగా వ్యవహరిస్తూ విపక్షాల నోళ్లకు ఇన్ని రోజులు తాళం వేస్తూ వచ్చాడు కానీ ఇప్పుడు సీన్ ఒక్కసారిగా మారింది.

 

అచ్చెన్నాయుడు అరెస్ట్ తో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్రం నలుమూలల ఎన్ని రోజులు సరైన సమయం కోసం కాచుకుని కూర్చున్న టిడిపి వారంతా అంతా ఒక్కసారిగా అధికార పార్టీ పైన పడిపోయారి. ఇప్పటికే మొన్న స్థానిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో జరిగిన రచ్చ వలన బాగా ఆగ్రహంతో రగిలిపోతున్న టిడిపి ప్రజలంతా ఒకసారి కలిసిపోయి అచ్చెన్నాయుడు అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియాలో అయితే అతనికి మద్దతుగా ఒక హాష్ టాగ్ ను విపరీతంగా ట్రేడ్ చేయడం మొదలుపెట్టారు.

 

అసలు మొన్న జరిగిన మహానాడుకు కూడా రాష్ట్ర కార్యకర్తల నుండి పెద్దగా హడావిడి లేదు. ఎంత లాక్ డౌన్ సమయం అని అధిష్టానం సర్ది చెప్పుకున్నా కూడా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని చెప్పాలి. కానీ ఇప్పుడు అచ్చెన్నాయుడు తో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు అతడి కొడుకు అరెస్టు తర్వాత టీడీపీ వారికి కు జగన్ పైన విరుచుకుపడడమే పని అయిపోయింది.

 

దీంతో టిడిపి హైకమాండ్ చాలా ఖుషి అయిపోయారు. తమ పార్టీకి పూర్వవైభవం వస్తుంది అన్న ఆశలు మరలా చిగురించాయి అనే చెప్పాలి. దీనికి తగ్గట్టు చంద్రబాబు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు. మళ్ళీ మేము పవర్ లోకి వస్తాం అప్పుడు చూపిస్తాం అని పోస్ట్ చివరి లైన్ లో ఉంది. దాన్ని బట్టి జగన్ టిడిపి క్యాడర్ కి ఎంత చక్కటి గుడ్ న్యూస్ చెప్పారో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: