కరోనా వైరస్ ప్రభావం ఉన్న కొద్ది పెరిగిపోతుంది. ఈ వైరస్ నుండి ప్రజలను రక్షించడానికి పోరాడుతున్న పోలీసులకు కూడా కరోనా ఎక్కువ సోకుతున్నట్లు నమోదవుతున్న కేసులు బట్టి వార్తలు వినబడుతున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న పశ్చిమబెంగాల్ అదేవిధంగా మహారాష్ట్రలో మొన్నటి వరకు పోలీసులకు కరోనా వైరస్ బాగా సోకుతున్నట్లు.. ఈ నేపథ్యంలో డ్యూటీ చేయటానికి ఆ రాష్ట్ర పోలీసులు భయపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ నగరంలో పోలీసులకు వైరస్ ఎక్కువ సోకుతున్నయి. వైరస్ ప్రభావం హైదరాబాద్ నగరంలో ఎక్కువగా ఉండటంతో కేసులు పెరగడం తప్ప ఎక్కడా తగ్గే పరిస్థితి కనబడటం లేదు. దీంతో హైదరాబాద్ పోలీసులో ఆందోళన మొదలయ్యింది.

 

ఒక్క బంజారా హిల్స్ పరిధిలోనే పోలీసులకు 15 మందికి కరోనా వచ్చింది. అంతేకాకుండా చాలా మంది ఈ మహమ్మారి కరోనా వైరస్ వల్ల పోలీసులు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. దీంతో పోలీసులు పరిస్థితి తెలుసుకొని చాలా మంది ప్రజలు పాపం అని స్పందిస్తూ ప్రభుత్వం వారి కోసం సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నగరంలో విధులు నిర్వహించడానికి చాలా మంది పోలీసులు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.

 

మరోపక్క తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదు నగరం కీలకం కాబట్టి వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి హైదరాబాద్ నగరాన్ని సంపూర్ణ లాక్ డౌన్ విధించడానికి ఆలోచిస్తున్నట్లు త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఈ నెల 16, 17 వ తారీఖున ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్న తరుణంలో ఈ సమావేశం అయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరం విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: