అనూహ్య రీతిలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం గ్రేడ్ల ఆధారంగా సంవత్సరపు రాష్ట్రంలోని పదవ తరగతి విద్యార్థులు అందరినీ ఉత్తీర్ణులని చేసి ఇంటర్మీడియట్ కు పంపనున్న విషయం తెలిసిందే. హైకోర్టు ఇచ్చిన నిర్ణయం పట్ల కొద్దిగా నిరాశ చెందిన తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోగా అదే ప్రక్రియను తమిళనాడు ప్రభుత్వం కూడా ఫాలో కావడం గమనార్హం. అయితే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పదవతరగతి పరీక్షలు పెట్టి తీరుతామని జగన్ సర్కారు వెల్లడించిన విషయం కూడా తెలిసిందే.

 

ఇకపోతే ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం పరీక్షల యొక్క ఫలితాలను విడుదల చేసిన విషయం కూడా తెలిసిందే. ఇక తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చే వారమే విడుదల అయ్యే అవకాశం ఉండగా దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీలైనంత త్వరగా రిజల్ట్స్ రిలీజ్ చేసేందుకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేయగా.... ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం పరీక్షల ఫలితాలను ఒకేసారి ప్రకటిస్తామని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ చెప్పారు.

 

మే 12 నుండి 30 తేదీ వరకు సమాధాన పత్రాల మూల్యాంకనం నిర్వహించామని చెప్పిన ఆయన ఫలితాలు నమోదు ప్రక్రియ చివరి దశకు చేరుకుందని వెల్లడించాడు. లాక్ డౌన్ కారణంగా ఫలితాల వెల్లడి ఆలస్యం ఉన్నట్లు అర్థమవుతోంది. ఇకపోతే ప్రస్తుతం జవాబు పత్రాల స్కానింగ్, మార్కులు అప్‌లోడింగ్, తుది పరిశీలన, ఇంటర్నెట్ మెమోల రూపకల్పన వంటి సాంకేతిక ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు ఉమర్ జలీల్ పేర్కొన్నారు. మొత్తం ప్రక్రియ నెల 15 నాటికి పూర్తవుతుందని ఆయన చెప్పగా జూన్ 15 తేదీ తర్వాత క్షణమైనా పరీక్షల ఫలితాలు వెల్లడించేందుకు ఇంటర్మీడియట్ శాఖ సిద్ధంగా ఉందని అన్నారు.

 

ఇక కేసీఆర్ కూడా ఇంటర్మీడియట్ ఫలితాలను వచ్చే వారంలో విడుదల చేసేందుకు సముఖంగా ఉన్నట్లు కొన్ని విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందింది. అలాగే ఆంధ్రప్రదేశ్ సర్కారు చేసినట్లుగానే మొత్తం ఆన్లైన్ లోనే పరీక్ష ఫలితాలు విడుదల చేస్తుండగా కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ నియమాలను పాటిస్తూ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: