అసలే కరోనా వల్ల చేతిలో డబ్బులు లేక, ఇంట్లో నిత్యావసరాలు నిండుకోగా, చేద్దామంటే పనులు లేవు, చాలీచాలని జీతాలతో బ్రతుకులు వెళ్ళదీస్తున్న మధ్యతరగతి నెత్తిన వరుసగా పిడుగులు పడుతున్నాయి.. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో మరోసారి వైరస్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని స్దితిలో ఆందోళన పడుతున్న జనానికి, కరెంట్ బిల్లులు కరాటే ఫైటర్‌లా వాయిస్తున్నాయి.. వేయిలు, లక్షలు దాటిన బిల్లులను చూస్తుంటే కరోనా తెచ్చిన కష్టాలకు ఏం చేయాలో తోచని వారు కూడా ఉన్నారు..

 

 

ఇలాంటి పరిస్దితుల్లో ప్రభుత్వం 3 వాయిదాల్లో 3 నెలలపాటు విద్యుత్ బిల్లులు చెల్లించే వెసులుబాటు కల్పించింది. ఇక ఎలాగూ వెసులుబాటు ఉంది కదా అని నిర్ణీత గడువులోగా చెల్లించకుంటే మాత్రం  విద్యుత్తు పంపిణీ సంస్థ వడ్డీభారం మోపనున్నాయి. ఇకపోతే తొలి వాయిదా బిల్లును ఈ నెల 20వ తేదీలోపు చెల్లించాలి.. డబ్బులు ఉన్నప్పుడు కడదాం లే కట్టకుంటే కొంపలేం అంటుకోవు కదా అని ఆలోచిస్తే 1.50 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తారు. ఇక ఈ నిబంధన ఎప్పటి నుంచో అమలులో ఉన్నా.. లాక్‌డౌన్‌ వల్ల వడ్డీ మినహాయింపు ఉండవచ్చని చాలామంది వినియోగదారులు భావిస్తున్నారు. అందుకే నిర్ణీత గడువులోపు చెల్లించని వారికి పాత నిబంధనల ప్రకారమే వడ్డీని వసూలు చేస్తామని డిస్కంలు స్పష్టం చేశాయి..

 

 

అంతే కాకుండా మూడు నెలల వాయిదాల్లో బిల్లు చెల్లించకుంటే ఆ బిల్లులను విడతల వారిగా వడ్డితో సహా వసూలు చేయడానికి అధికారులు సిద్దం అయ్యారు.. అదెలా అంటే మీకు జారీ అయిన బిల్లు సొమ్ములో ఈ నెల 30 శాతం, జులైలో 40, ఆగస్టులో మిగిలిన 30 శాతం చొప్పున కట్టాల్సి ఉంది. ఈ నెల 30 శాతం కట్టిన వారికి మిగిలిన 70 శాతం సొమ్ముపై 1.50 శాతం వడ్డీ వేస్తామని డిస్కంలు తెలిపాయి.

 

 

ఇలా మీ వడ్ది కుప్పలా మారి మీకే భారం అవుతుంది.. ఇకపోతే రాష్ట్రంలో మొత్తం 90.36 లక్షల మంది వినియోగదారులు ఉండగా, అందులో లాక్‌డౌన్‌ కారణంగా గత మార్చి నుంచి మే వరకూ 40.69 లక్షల మంది అసలు బిల్లులే కట్టలేదు. వీరు రూ.444.57 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనిపై 1.50 శాతం చొప్పున రూ.6.66 కోట్ల వడ్డీ వేశారు. ఇది మొత్తం రాష్ట్ర ప్రజల లెక్క.. ఇక మీ వాటాగా ఎంత ఉంటుందో మీరే లెక్కలు వేసుకోండి.. త్వరగా బిల్లులు కట్టి వడ్డీల బారినుండి తప్పించుకోండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: