ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఎటునుంచి.. ఎవరి నుంచి వస్తుందో కూడా మనం దాన్ని కనిపెట్టలేం. అంతే కాదు..అది వచ్చిన తర్వాత కూడా వెంటనే లక్షణాలు కనిపించవు. మెల్ల మెల్లగా కరోనా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సహజంగా ఈ మధ్య కాలంలో జ్వరం, దగ్గు వచ్చాయంటే కరోనా ఏమో అని కంగారుపడుతున్నారు. పరీక్షలు చేయించుకుంటున్నారు.

 

 

అయితే మీకు కరోనా వస్తే.. జ్వరం, దగ్గు మాత్రమే కాదు.. మరికొన్ని లక్షణాలు కనిపించినా మీకు కరోనా వచ్చిందేమో అని అనుమానపడొచ్చు. అవేంటంటే.. జ్వరం, దగ్గు, జలుబుతో పాటు వాసన, రుచి చూసే సామర్థ్యాన్ని కోల్పోవడం కూడా కరోనా లక్షణమేనట. అంతే కాదు.. కండరాల నొప్పి, అతిసారం, ముక్కు రంధ్రాలు మూసుకు పోవడం, కఫం రావడం వంటి లక్షణాలు ఉన్నా మీకు కరోనా వచ్చిందేమో అని అనుమానం రావాల్సిందే.

 

 

ఈ వివరాలు తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతే కాదు.. కరోనా చికిత్సకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సవరణలను చేసింది. మలేరియా మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను.. తొలిదశ చికిత్స సమయంలోనే వాడాలని సూచించింది. మధ్యస్థ దశలో రెమిడెసివిర్‌కు అనుమతి ఇచ్చింది. రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరిచే టోసిలిజుమాబ్ మందుకు కూడా అనుమతిచ్చింది. కరోనా తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ప్లాస్మా మార్పిడికి కేంద్ర ఆరోగ్య శాఖ ఆమోదం తెలిపింది.

 

 

అయితే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ వాడకంతోపాటు వైరస్‌ చికిత్స విధానంలో సవరణలు చేసింది. మలేరియా మందును వ్యాధి ప్రారంభంలోనే ఉపయోగించాలని స్పష్టం చేసింది. వ్యాధి తీవ్రంగా ఉన్నవారికి అజిత్రోమైసిన్ తో కలిపి వాడొద్దని చెప్పింది. హైడ్రాక్సీక్లోరోక్విన్ వైరస్ కు వ్యతిరేకంగా ఇన్-విట్రో కార్యకలాపాలను ప్రదర్శించిందని పలు అధ్యయనాలు వెల్లడించిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: