భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 11,929 మందికి కొత్తగా కరోనా సోకింది.  దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 3,20,922కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం  9,195కి పెరిగింది. 1,49,348  మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,62,379 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. అదే సమయంలో 311 మంది మరణించారు.  కరోనా మరణాల్లో ఒక్కో దేశం నువ్వా నేనా.. అంటూ పోటీపడుతున్నాయి.

 

లాటిన్ అమెరికా దేశమైన బ్రెజిల్ లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఇప్పటికే బ్రెజిల్ కరోనా మృతుల్లో రెండవ స్థానానికి చేరుకున్న సంగతి తెల్సిందే. తాజాగా ఆ దేశంలో కరోనా మృతులను ఖననం చేసేందుకు శ్మశానాల్లో కూడా లభించడం లేదు.   ఇక లాభం లేదని పాత సమాధులను తవ్వేసి కరోనా మృతుల మృతదేహాలను ఖననం చేస్తున్నారు.  వాస్తవానికి రెండు నెలల క్రితం కరోనా ని అరికట్టడానికి లాక్ డౌన్ పాటించిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మెల్లి మెల్లిగా లాక్ డౌన్ సడలింపు చేస్తూ వచ్చారు. 

 

వలస కార్మికులు తమ స్వస్థలాలు వెళ్లడం ద్వారా కూడా కరోనా కేసులు పెరిగితున్నాయని అంటున్నారు. ప్రతిరోజూ పెరిగిపోతున్న కరోనా కేసుల వల్ల మరణాలు పెరిగిపోతు న్నాయి.  సావో పాలోలోని అతిపెద్ద శ్మశాన వాటికలో మూడేళ్ల కిందట ఖననం చేసిన మృత దేహాలను తీసేసి, సమాధులను తవ్వేస్తున్నారు. కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న సావో పాలో ప్రాంతంలో గురువారం నాటికి 5480 మంది మృతి చెందారు. కరోనా కేసులు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. బ్రెజిల్ లో ఇప్పటి వరకు 42 వేల మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: