అధికారం అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు వారి హయాంలో పలు ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఆరోపణలతో అరెస్టులు జరిగిన సంగతి తెలసిందే. ఇందకు తమ వద్ద సాక్ష్యాలున్నాయని వైసీపీ మంత్రులు, నాయకులు కుండ బద్దలుకొట్టి మరీ చెప్తున్నారు. ఏదైమైనా టీడీపీ నాయకులకు ఊపిరి ఆడటం లేదన్నది నిజం. దీంతో వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై ఇతర పార్టీలు గళమెత్తాలని టీడీపీ అధినేత పిలుపునిస్తున్నారు. అయితే.. అధికారంలో ఉన్నప్పుడు ఇవే పార్టీలను చంద్రబాబు కనీసం పట్టించుకోలేదని ఉదహరిస్తున్నాయి పలు పార్టీలు. ఇవన్నీ ఇప్పుడా పార్టీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు.

IHG

 

అధికారంలో ఉండగా ఇతర పార్టీలను కనీసం గౌరవించలేదని.. ఇప్పుడెలా మద్దతు అడుగుతున్నారని టీడీపీకి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. పవన్ ఇప్పటికైనా మేల్కోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో టీడీపీకి వంత పాడితే పవన్ కే నష్టమని జనసైనికులు కూడా అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా తామనెంత అణచివేసారో అంటూ గతాన్ని తవ్వుతున్నారు. బాబు తీరును గుర్తించే ప్రభుత్వానికి బీజేపీ వంత పాడుతోంది. బీజేపీ, జనసేన సాయంతో టీడీపీ అధికారంలోకి వచ్చిందని.. రెండేళ్ల తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయిందంటూ సోషల్ మీడియాలో టీడీపీపై కామెంట్లు వస్తున్నాయి.

IHG

 

టీడీపీకి ఓటేయాలని పిలుపిచ్చిన పవన్ మాటను అభిమానులు, జనసేన కార్యకర్తలు పాటించారు. బీజేపీ కూడా చంద్రబాబుతో చేతులు కలపింది. మోదీ, బాబు, పవన్ లు కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. బాబు ఇవన్నీ మర్చిపోయారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ధర్మపోరట దీక్షలు పేరుతో ఏకంగా ప్రధాని మోదీపైనే ప్రత్యక్ష యుద్ధం చేశారని కొందరు గుర్తు చేసుకుంటున్నారు. పవన్ ను, జనసేన కార్యకలాపాలను తొక్కిపెట్టేశారని ఆ పార్టీ కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీని నమ్మి మళ్లీ ఏ పార్టీ కూడా దరి చేరే అవకాశాలు లేవని ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయి.

IHG'depression' fearing <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ARREST' target='_blank' title='arrest-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>arrest</a>, family takes him on foreign ...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: