యావత్ ప్రపంచం మొత్తం భయబ్రాంతులకు గురి చేసినది కరోనా వైరస్. కరోనా కి కనికరం లేదు ఎవరిని వదిలిపెట్టడం లేదు.ఈ మహమ్మారికి చిన్న, పెద్ద, ముసలి, ముతకా, ధనిక, పేద, ఆడ, మగ  అని తేడా లేదు.మరి గోరంగా ఒక నాలుగు నెలల పసి పాపను కూడా పట్టి పీడిస్తుంది. కాని ఆ పాప 18 నెలల పాటు వెంటిలేటర్ పై పోరాడి  కరోనాలాంటి మహమ్మారిని జయించి మళ్ళీ మాములు స్థితికి చేరుకొని అమ్మ ఒడిని చేరుకుంది.

 

 

ఈ 18 రోజులు తల్లికి దూరంగా ఉంది పాప, బిడ్డకి దూరంగా ఉండి తల్లితండ్రులు ఎంత బాధ పడ్డారో వర్ణించలేము. ఈ ఘటన ఎక్కడో కాదు మన  ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ నగరంలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే తూర్పు గోదావరికి  చెందిన  గిరిజన మహిళ లక్ష్మీకి  వైరస్ సోకింది. దీనితో  అనుమానం వచ్చిన వైద్యులు  ఆమె నాలుగు నెలల చిన్నారికి సైతం వైరస్  నిర్ధారణ పరీక్షలు చేశారు. కాని ఈ పరీక్షల్లో ఆ చిన్నారికి వైరస్ పాజిటివ్ అని తేలింది. ఈ పసిపాపకు పాజిటివ్ అని తెలియడంతో అందరు షాక్ లో ఉండిపోయారు. తదుపరి ఆ  చిన్నారిని  చికిత్స అందించేందుకు మే 25న విశాఖపట్నంలోని వీఐఎంఎస్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. 

 

 


అక్కడ  హాస్పిటల్ లో  18 రోజుల పాటు ఆ చిన్నపాపని వెంటిలేటర్ పై  ఉంచి చిన్నారికి చికిత్స చేశారు వైద్యులు. 18 రోజులు పాటు వెంటిలేటర్ పై  చికిత్స తీసుకున్న చిన్నారి చివరికి  కరోనా వైరస్ ను జయించి అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే  మరోసారి నిర్ధారణ చేసుకునేందుకు ఆ చిన్నారికి వైద్య పరీక్షలు చేయడంతో నెగటివ్ గా వచ్చింది. దీనితో  శుక్రవారం సాయంత్రం మళ్ళీ చిన్నారికి అన్ని పరీక్షలు చేసి ఆసుపత్రి నుంచి ఇంటికి డిశ్చార్జి చేశారు. పాప ఆరోగ్యంగా ఉందని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మీడియాతో చెప్పారు. 18 రోజుల పాటు నరకయాతన అనుభవించి బుసి బుసి నవ్వులు నవ్వుతూ చివరగా అమ్మ ఒడిని చేరింది ఈ పాప.

మరింత సమాచారం తెలుసుకోండి: