సినిమా రంగంలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించిన కమలహాసన్ ప్రస్తుతం రాజకీయ రంగంలో కూడా మెల్ల మెల్లగా యాక్టివ్ అవుతున్నారు. 2018 వ సంవత్సరం లో "మక్కల్ నీది మైయమ్" అనే పార్టీని తమిళనాడులో స్థాపించడం జరిగింది. అంతకుముందు పార్టీని స్థాపించాక ముందే కమలహాసన్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టడానికి చాలా ముందుండేవారు. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకునే విధానాలను ప్రజలకు భారంగా ఉండే విషయాలను మీడియా ముందు ప్రశ్నిస్తూ వార్తల్లో నిలిచేవారు కమలహాసన్. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా మరోసారి కేంద్ర ప్రభుత్వంపై వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేశారు. పూర్తి విషయంలోకి వెళితే కొద్దిరోజులుగా ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెంచుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

IHG

ఇలాంటి సందర్భంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలతో నిత్యావసరాల ధరలు కూడా పెంచుతున్నారని విమర్శించారు. గతంలో ప్రభుత్వం ముడిచమురు ధర పెరుగుదల కారణంగా పెట్రోల్ ధరలు పెంచినట్లు దాంతో నిత్యావసరాల ధరలు కూడా పెరిగాయని… కానీ ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడి చమురు ధర తగ్గిన క్రమంలో దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తే నిత్యావసరాల వస్తువుల ధరలు కూడా తగ్గి ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతుందని చెప్పుకొచ్చారు.

IHG

కానీ వీటన్నిటికీ భిన్నంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రస్తుత సమయంలో లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఆర్థికంగా నష్టపోయారని ఇలాంటి సమయంలో కేంద్రం ప్రజలపై భారం పెట్టకుండా సరైన విధంగా ఆలోచించాలని ధరలు తగ్గించాలని కమలహాసన్ కోరుతున్నారు. ప్రస్తుతం కమలహాసన్ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు సీక్వెల్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అయినా వెంటనే పూర్తి రాజకీయాలలో కమలహాసన్ రావటానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: