దేశంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కొత్త కేసులు పెరిగిపోతున్న తరుణంలో కేంద్రంలో టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో కేంద్ర పెద్దలు ఢిల్లీ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఈ సమావేశానికి హాజరైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్రంతో చర్చలు సఫలమయ్యాయి అని ప్రకటించారు. కరోనా మహమ్మారి కట్టడి చేయడం కోసం కేంద్రంలో జరిగిన చర్చలు ఫలప్రదం అయ్యాయని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఇలాంటి విషమ పరిస్థితి ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్ధతకు కార్యాచరణ సిద్ధం చేశామని చెప్పారు.

 

 

ఢిల్లీ హోటల్లో సమావేశ మందిరాలలో 20 వేలకు పైగా బెడ్ లు రెడీ చేయాలని నిర్ణయించామని అన్నారు. కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసిందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ జరిమానా విధిస్తామని కేజ్రీవాల్ హెచ్చరించారు. ప్రజలు ఇల్లు వదిలి బయటకు వచ్చినప్పుడు ఫేస్ మాస్క్ ధరించకపోయినా సోషల్ డిస్టెన్స్ పాటించకపోయినా పబ్లిక్ ప్రాంతాల్లో ఉమ్మేసిన భారీగా జరిమానాలు ఉంటాయి అని వార్నింగ్ ఇచ్చారు. మొదటిసారి 500 రెండోసారి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు.

 

దేశంలో కరోనా వైరస్ సగం కేసులు మహారాష్ట్రలో మరియు ఢిల్లీలోనే నమోదు అవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. దేశంలో ఉన్న కొద్ది వైరస్ ప్రభావం పెరగటంతో మిగతా రాష్ట్రాలలో కూడా టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ వారంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ జరిపే సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలో నెలకొంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: