కరోనా వైరస్ ఉన్న కొద్ది ఉదృతంగా ఇండియాలో మారుతున్న విషయం అందరికి తెలిసిందే. కరోనా వైరస్ బయటపడిన సమయంలో చైనా పక్కనే ఇండియా ఉండటంతో..పైగా ఎక్కువ జనాభా గల దేశం అవటంతో ఇండియా పని మొదటి అయిపోతుందని అందరూ భావించారు. అనూహ్యంగా ఆ టైంలో యూరోప్ మరియు అమెరికాలో విచ్చలవిడిగా కరోనా వైరస్ అనేక మందిని బలి తీసుకుని భయంకరంగా వ్యాప్తి చెందింది. కానీ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం సకాలంలో లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవడంతో చాలా వరకు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా గల దేశంగా పేరు ఉన్న ఇండియాలో పెద్దగా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో అంతర్జాతీయస్థాయిలో ప్రశంశలు లభించాయి.

 

ఇదిలా ఉండగా ప్రస్తుతం సీన్ మొత్తం మారిపోతుంది. లాక్ డౌన్ ఆంక్షలు మరియు సడలింపులు చాలావరకు ఎత్తివేయడంతో పాటు ప్రజలలో పెద్దగా కరోనా భయం లేకపోవటంతో ఇండియాలో కరోనా వ్యాప్తి తారా స్థాయిలో ఉన్నట్లు బయటపడుతున్న కేసులు బట్టి అర్థం అవుతోంది. ఇదిలా ఉండగా మహారాష్ట్ర మరియు దేశ రాజధాని ఢిల్లీలో భయంకరంగా కరోనా వైరస్ వ్యాప్తి చెంది ఉందని, దేశంలో కొత్తగా నమోదవుతున్న కేసులలో సగం కేసులు ఈ రెండు రాష్ట్రాల్లోనే నమోదు అవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

 

దీంతో కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం మంతనాలు జరుపుతోంది. ఇప్పటికే కేంద్ర హోం శాఖ ఢిల్లీ సర్కార్ తో మంతనాలు జరిపి కరోనా వ్యాధి అరికట్టడానికి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. పరిస్థితి చూస్తే ఈ రెండు రాష్ట్రాలలో ఉన్న ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వణికిపోతున్నారు. మరోపక్క కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని కోరుతున్నారు. ఇటువంటి సమయములో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలో నెలకొంది. తాజాగా మరోసారి లాక్ డౌన్ విధిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది అని అంటున్నారు. మరి ప్రధాని మోడీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: