ఢిల్లీలో కరోనా పరిస్థితులపై కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. కరోనా కట్టడిపై కేంద్రం కీలక సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశం అమిత్ షా నేతృత్వంలో ఆదివారం కీలక సమావేశం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశంలో ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసుల పై చర్చించినట్లు తెలుస్తుంది.  ఈ భేటీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ అనీల్ బాయ్‌జల్, ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఢిల్లీలో ఇప్పటివరకు 38 వేల 958 కేసులు నమోదయ్యాయి.

 

మహమ్మారి బారినపడి 1271 మంది మృత్యువాత పడ్డారు. ఢిల్లీ నగరంలో మొత్తం దాదాపు కంటైన్‌మెంట్ జోన్‌గా మారిపోయింది. ఏ కాలనీలో చూసిన వందలకొద్దీ కేసులు నమదవుతూనేవున్నాయి. అటు మృతుల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 80 బ్యాంకెట్ హాళ్లలో 11 వేల బెడ్లను, 40 హోటళ్లలో 5 వేల బెడ్లను అందుబాటులోకి తేనున్నారు. ఇక 10 నుంచి 49 బెడ్లు ఉన్న ఆస్పత్రుల్లో మరో 4 వేల బెడ్లను కరోనా రోగుల కోసం కేటాయించనున్నారు.

 

జూలై నెలాఖరు నాటికి అదనంగా 80 వేల బెడ్ల అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంలో భాగంగానే ఢీల్లీ ప్రభుత్వం అదనపు సౌకర్యాలను సిద్ధం చేసుకుంటోంది.    కరోనా రోగులకు పడకల కొరత దృష్ట్యా రైల్వే కోచ్ లు కేటాయిస్తున్నామని తెలిపారు. ఢిల్లీకి కేంద్రం 500 రైల్వే కోచ్ లను అందిస్తుందని వెల్లడించారు. రైల్వే కోచ్ ల ద్వారా 8 వేల బెడ్లు అందుబాటులోకి వస్తాయని అమిత్ షా వివరించారు. ఈ రైల్వే కోచ్ లో కరోనా రోగులకు అన్ని సదుపాయాలు ఉంటాయని అన్నారు. వచ్చే రెండ్రోజుల పాటు ఢిల్లీలో కరోనా టెస్టులు రెట్టింపు చేయాలని, మరో 6 రోజుల్లో మూడు రెట్లు పరీక్షలు నిర్వహించాలని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: