ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైంది. ఏడాది కాలంలో సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టారు. పలు కేసుల్లో కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నా ప్రజల మద్దతు కూడగట్టుకోవడంలో వైసీపీ సక్సెస్ అయింది. ఏడాది పాలనలో సీఎం జగన్ 90 శాతం హామీలను అమలు చేశారు. మిగిలిన హామీల అమలు కోసం ఇప్పటికే తేదీలను ఫిక్స్ చేశారు. 
 
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో టీడీపీ నేతల అక్రమాలపై దృష్టి పెట్టగా తాజాగా మరోసారి ఆ పార్టీ నేతల అక్రమాలపై కేసుల నమోదు కావడంతో పాటు అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. గతంలో అచ్చెన్నాయుడు, తాజాగా లోకేష్ టీడీపీ నేతలపై ఆరోపణలు చేయడం కాదు.... ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయాలని వ్యాఖ్యలు చేశారు. లోకేష్ వ్యాఖ్యలకు సమాధానంగా పేర్ని నాని చట్టం తన పని తాను చేసుకుపోతుంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. 
 
ఇప్పటికే అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి కీలక నేతలను అరెస్ట్ ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేయబోతున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. వైసీపీ వర్గాల్లో కొందరు నేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారిలో ప్రత్తిపాటి పుల్లారావు ముందువరసలో ఉన్నారు. ప్రత్తిపాటి 18 మంది రైతుల పేర్లతో వేల టన్నుల పత్తి కొనుగోలు చేశారని.... రాజధాని భూముల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని తెలుస్తోంది. 
 
చంద్రన్న కానుకలో అక్రమాలు జరిగాయని... వైసీపీ సీబీఐ విచారణకు ఆదేశిస్తే పరిటాల సునీత ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఏవీ సుబ్బారెడ్డి హత్య కేసులో అఖిలప్రియ, ఆమె భర్తపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. లోకేష్, చంద్రబాబులను వైసీపీ చివర్లో టార్గెట్ చేస్తుందని ఆళ్లపాటి రాజా, వరదాపురం సూరి, కొమ్మలపల్లి శ్రీధర్, వెలగపూడి రామకృష్ణ, కూన రవికుమార్ కూడా జగన్ హిట్ లిస్ట్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: