ఏపీ సీఎం జగన్ అంటే.. ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ ఏ రేంజ్‌లో విరుచుకుపడతారో తెలిసిందే. తన పత్రికల్లో వార్తల విషయంలోనూ.. తన ఎడిటోరియల్ కాలమ్ కొత్త పలుకులోనూ జగన్ తీరును ఆయన తూర్పారపడుతూ ఉంటారు. ఆర్కే చంద్రబాబు అనుకూలుడని.. జగన్ అంటే ఏమాత్రం గిట్టదని ఆయన పత్రికను ఫాలో అయ్యే వారందరికీ తెలిసిందేనంటుంటారు.

 

 

అయితే ఇప్పుడు అదే ఆర్కే ఓ విషయంలో మాత్రం జగన్ గొప్పదనాన్ని అంగీకరిస్తున్నారు. ఏదేమైనా జగన్ ఆ విషయంలో జగన్ ను మెచ్చుకోవాల్సిందే అంటున్నారు. ఏ విషయంలో అంటారా.. కరోనాతో మనం సహజీవనం చేయాల్సిందే అని అందరికంటే ముందే జగన్ చెప్పిన విషయాన్ని తాజాగా ఆర్కే తన కొత్త పలుకు వ్యాసంలో గుర్తు చేశారు. మొదట్లో హడావిడి చేసిన మోడీ, కేసీఆర్ వంటి నేతలు కూడా జగన్ రూట్లోకే వచ్చారని రాసుకొచ్చారు.

 

 

ఇంతకూ ఆర్కే ఏం రాశారంటే.. “ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విషయానికి వద్దాం. ఈ వైరస్‌ను ఆయన మొదటి నుంచీ సీరియస్‌గా తీసుకోలేదు. ‘‘కరోనా వస్తుంది.. పోతుంది..’’ అని ఆయన తేల్చిపారేశారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఇప్పుడు పాలకులు అందరూ చెబుతున్న ‘‘కరోనాతో సహజీవనం చేయాల్సిందే..’’ అన్న మాటను అందరికంటే ముందే జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. ప్రారంభంలో అధికారులతో సమావేశాలు జరిపినట్టు ప్రకటించి, వీడియో సందేశాలు విడుదల చేసిన జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు కరోనా ఊసే ఎత్తడం లేదు.. అంటూ రాశారు రాధాకృష్ణ.

 

 

ఆర్కే తరహాలోనే మనం కూడా ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి. చాలా విషయాల్లో జగన్ ను తూర్పారబట్టే ఏబీఎన్ ఆర్కే.. ఇలాంటి విషయాల్లో నిజాలే రాస్తారు. ఆ మధ్య జగన్ అనుసరిస్తున్న సోషల్ ఇంజినీరింగ్ విధానాన్ని కూడా ఆర్కే ఇలాగే మెచ్చుకున్నారు. ప్రత్యర్థి గొప్పదనాన్ని అంగీకరించడం అంత సులభం కాదు. దానికి ఎంతో పెద్ద మనసు ఉండాలి కదా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: