ప్రతి మహిళకు పిల్లలు కనడం ఒక కళ. ఆ కలను నెరవేర్చుకోవడానికి 9 నెలలు నిత్యం కష్టపడుతూ ఉంటుంది. అంతేకాకుండా పాపా లేక  బాబు పుట్టిన తర్వాత వాళ్లను ఎలా చూసుకోవాలి అన్న విషయాలన్నీ కూడా ముందు నుంచే క్రమబద్ధంగా చూసుకుంటుంది.  అలాంటి ఒక మహిళకు ఒకే కాన్పుతోనే తనకు మూడింతల సంతోషం కలిగించాడు ఆ దేవుడు. సాధారణంగా ప్రస్తుత రోజుల్లో ఒక డెలివరీ చేయాలంటే ప్రైవేట్ ఆస్పత్రిలో నార్మల్ డెలివరీ చేయకుండా... చాలా వరకు సిజేరియన్ చేయడానికి వైద్యులు మొగ్గుచూపుతారు. 

 


అయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో నార్మల్ డెలివరీకి ప్రాధాన్యత ఇస్తూ కాన్పు చేయటంలో చాలా విశేషం. తాజాగా తెలంగాణ లోని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ హాస్పిటల్లో నారాయణపేట పట్టణం పళ్ళ ప్రాంతానికి చెందిన ఒక మహిళ కు డెలివరీ చేయగా.., ఆ మహిళకు ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మనివ్వడం జరిగింది. 

 


ఇకపోతే ఆ మహిళలకు వైద్య అధికారులు సిజరింగ్ కాకుండా నార్మల్ డెలివరీ తోనే పురుడు పోయడం జరిగింది. ఆ ముగ్గురిలో ఇద్దరు మగ పిల్లలు, ఒక పాప ఉన్నారు. అక్కడి వైద్యులు ముగ్గురు పిల్లలు, తల్లి కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలియజేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న చక్కటి వైద్య సేవలకు ఇది ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. మామూలుగా ఇలాంటి సంఘటనలు కేవలం పది లక్షల మందిలో ఒక్క మహిళలకు మాత్రమే కలుగుతుంది. అదిప్పుడు ఈమెకు లభించింది. ఏది ఏమైనా ప్రభుత్వ డాక్టర్లు అద్భుతం చేసి చూపించారు. ఒంటి మీద ఎలాంటి చిన్న గాటు లాంటిది లేకుండా కేవలం మామూలు కాన్పు తోనే ఒకరి తర్వాత ఒకరిని తీస్తూ అందరిని ప్రాణాలతో సురక్షితంగా బయటికి తీశారు. ప్రస్తుతం పిల్లల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: