నువు ప్రేమించిన అబ్బాయిని మర్చిపో.. మేము చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకో’ అని పెద్దలు తమ కూతురు ప్రేమను తిరస్కరించారు. పంతానికి పోయి వేరే అబ్బాయిని వెతికి పెళ్లి ఫిక్స్ చేశారు. తల్లిదండ్రుల నిర్ణయాన్ని కాదనలేక ఆ కూతురు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవడానికి సిద్దపడింది. పెళ్లి అయ్యాక.. వరుడికి అసలు విషయం తెలిసింది. దీంతో ఆ వరుడే మధ్యవర్తిత్వం వహించి కూతురు మనసు అర్థం చేసుకోవాలని పెద్దలకు చెప్పి పంచాయితీ పెట్టాడు. దీంతో ఆ పెళ్లి రద్దు చేసి, ప్రేమికుడికే కట్టుబెట్టారు.  ఈ ఘటన నల్గొండ జిల్లా కనగల్ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే, శాబ్దులాపురానికి చెందిన మౌనిక అనే యువతి, తన కుటుంబ సభ్యులతో కలిసి పదేళ్లుగా కురంపల్లిలో నివాసం ఉంటుండగా, ఆమెకు దేవరకొండ ప్రాంతానికి చెందిన యువకుడితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు.

 

వీరి వివాహం శుక్రవారం నాడు జరిగింది.  ప్రేమించిన వ్యక్తిని మరిచిపోవాలని.. తాము చూసిన యువకుడినే వివాహం చేసుకోవాలని పెద్దలు ఆంక్షలు విధించారు. దీంతో ఆమె కన్నవారి నిర్ణయానికి తన ప్రేమను త్యాగం చేసింది. వారు కుదిర్చిన వివాహం చేసుకోవడానికే సిద్ధమైంది. కొండ భీమనపల్లికి చెందిన వరుసకు మామ అయ్యే వ్యక్తితో శుక్రవారం మౌనికకు పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. గుండెల్లో గంపెడంత బాధతో తల వంచుకుని మెడలో తాళి కట్టించుకుంది. 

 

అయితే పెళ్లి సమయం నుంచి ఆమె కన్నీరు పెట్టుకోవడం గమనిస్తూనే ఉన్నాడు పెళ్లి చేసుకున్న భర్త. ఇక అప్పగింతల సమయంలో అందరినీ వదిలి భర్తను పట్టుకొని గట్టిగా ఏడ్చింది.. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని.. తాను వేరే వ్యక్తిని ప్రేమించానని చెప్పింది.   దీంతో మౌనికను వివాహమాడిన యువకుడు పెద్దల ముందు పంచాయితీ పెట్టాడు. పోలీసులు కూడా రంగంలోకి దిగారు. చర్చల తరువాత తాము పెళ్లిని రద్దు చేసుకున్నట్టు చెప్పిన మగ పెళ్లివారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: